నయనతార సీన్ రివర్స్ అయ్యింది..!
తను ఎలాంటి సినిమా తీసినా ప్రేఖకులు ఆదరిస్తారని నమ్మింది. తమిళంలో ఏమో కానీ తెలుగులో మాత్రం నయనతార సినిమా సీన్ రివర్స్ అయ్యింది. నయనతార లీడ్ రోల్ లో సినిమాకు తెగాల్సిన టికెట్లు తెగలేదు. అంతేకాదు సండే ఈవెనింగ్ షో ప్రసాద్ ఐమ్యాక్స్ లో కానీసం పది మంది కూడా లేరని టాక్. ఇది ఓ రకంగా నయనతారకు అవమానకరమే అని చెప్పొచ్చు. కనెక్ట్ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవడంతో విఫలమైంది. సినిమాలో మ్యాటర్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు.
నయనతార మాత్రం తెలుగు ఆడియన్స్ తనని పక్కాగా ఆదరిస్తారన్న నమ్మకంతో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. అంతేకాదు ఎప్పుడూ లేనిది ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఒకటి చేసింది. అయినా సరే ఉపయోగం ఏమీ లేకుండాపోయింది. నయన్ ఇంత కష్టపడినా సరే కనెక్ట్ సినిమా డిజాస్టర్ గా మారింది. బడ్జెట్, కాస్టింగ్ తక్కువే కాబట్టి ఫైనల్ గా ప్రాఫిట్స్ వచ్చాయేమో కానీ థియేట్రికల్ రన్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని చెప్పొచ్చు. నయనతార తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నా ఒక్క సినిమా ప్రమోషన్స్ కి వచ్చింది లేదు కానీ ఇప్పుడు సొంత సినిమా అయ్యే సరికి ఆమె స్పెషల్ ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. లేదంటే ఆమె సినిమాని ఆమాత్రం పట్టించుకునే వారు కాదు.