ఇండియాలో అత్యంత ప్రదాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా బుల్లి తెర అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలో బిగ్ బాస్ రియాల్టీ షో మొదట హిందీలో ప్రసారం అయింది. హిందీలో ఈ రియాల్టీ షో కు అద్భుతమైన రెస్పాన్స్ లభించడంతో ... ఆ తర్వాత ఈ రియాలిటీ షో ను పలు భాషలలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
అందులో భాగంగా ఇప్పటికే ఈ రియాల్టీ షో ను తెలుగులో కూడా తీసుకువచ్చారు. ఇప్పటికే ఈ రియాలిటీ షో తెలుగులో 6 సీజన్ లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. అలాగే "ఓ టి టి" బిగ్ బాస్ కూడా ఒక సీజన్ పూర్తి అయింది. బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా ... సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తరువాత 3 , 4 , 5 , 6 అలాగే "ఓ టి టి" షో కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున బిగ్ బాస్ 7 కు హోస్ట్ గా వ్యవహరించే అవకాశం లేదు అని తెలుస్తుంది.
దానితో బాలకృష్ణ ... రానా లలో ఎవరో ఒకరు బిగ్ బాస్ 7 కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ 7 హోస్ట్ కు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. బిగ్ బాస్ 7 కు మంచు విష్ణు హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉంది అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.