పోకిరి సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..!?

frame పోకిరి సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..!?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు కెరీర్ లోనే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.అంతేకాదు మహేష్ బాబు కి భారీ స్టార్ డంను కట్టబెడిన సినిమా కూడా ఇదే.ఈ సినిమాలో మహేష్ సరసన గోవా బ్యూటీ ఇలియానా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని మిస్ చేసుకుందట బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్గా దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాలీవుడ్లో వివాదాలు క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ.. మరోవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక ప్రస్తుతం కంగనా కంటెంట్ బేస్డ్ సినిమాలకి మొగ్గు చూపుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెద్దపీట వేసింది ఈ హీరోయినే. ఇక తెలుగులో కంగన రనౌత్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'ఏక్ నిరంజన్' అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ డైరెక్టర్ అనే విషయం తెలిసింది కదా. అయితే నిజానికి ఈ సినిమా కంటే ముందే పోకిరి సినిమాలో కంగనా హీరోయిన్గా చేయాల్సి ఉంది.కానీ అదే సమయంలో బాలీవుడ్ లో గ్యాంగ్ స్టర్ అనే సినిమాకి కంగనా సెలెక్ట్ అవడంతో ఆమె పోకిరి సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట.

దీంతో ఆమె స్థానంలో గోవా బ్యూటీ ఇలియానాను ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇక ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీని విష్ చేసుకున్నందుకు చాలా బాధపడిందట కంగనా. అంతేకాదు తెలుగులో ఆమె నటించిన ఏక్ నిరంజన్ సినిమా ఆమెకు తీవ్ర నిరాశ మిగిల్చడంతో ఇక తర్వాత నుండి ఆమె తెలుగులో నటించడానికి ఇష్టపడలేదట. ఒకవేళ అదే పోకిరి సినిమాలో కనుక హీరోయిన్గా నటించి ఉంటే ఈరోజు టాలీవుడ్ లో కూడా ఆమెకి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు వచ్చేది. ఇక ఇటీవల బాలీవుడ్ లో 'దక్కడ్' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది కంగనా. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: