సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. ప్రభాస్ ఆ పని చేసేవాడట?

frame సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. ప్రభాస్ ఆ పని చేసేవాడట?

praveen
రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన ప్రభాస్ రాజు ఇక ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లో మాత్రమే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమంలో మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఇక ఇప్పుడు అదే రీతిలో భారీ బడ్జెట్ సినిమాలను చేసుకుంటూ దూసుకుపోతూ ఉన్నాడు అని చెప్పాలి. ప్రభాస్ నటించిన ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలు పెద్దగా హిట్టు కొట్టకపోయినప్పటికీ చత్రపతి సినిమాతో ఒకసారిగా మాస్ హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

 ఇక సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరో ప్రభాస్ కావడం గమనార్హం. ఒక్కో సినిమాకి వంద నుంచి 150 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నాడు ప్రభాస్. అయితే ఇటీవలే ప్రభాస్ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి గెస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇందుకు సంబంధించిన రెండు ఎపిసోడ్లు కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు ఎపిసోడ్లకి వచ్చిన టిఆర్పి రేటింగ్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇకపోతే అన్ స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా నందమూరి బాలకృష్ణ ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు అడిగి ప్రేక్షకులకు కావాల్సిన ఎన్నో సమాధానాలను ప్రభాస్ నుంచి రాబట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏం చేసేవాడు అంటూ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు ప్రభాస్. ఒకవేళ తాను సినిమాల్లోకి రాకపోయి ఉంటే హోటల్లో పనిచేసే వాడట. ప్రభాస్ ది రాజుల కుటుంబం... కావడంతో ఇంటికి ఎవరు వచ్చినా రకరకాల వంటలు పెట్టి కడుపు నింపడం ఆయనకు అలవాటు. అందుకే ప్రభాస్ సినిమాల్లోకి రాకపోయుంటే అందరి కడుపు నింపే హోటల్ బిజినెస్ లోకి అడుగు పెట్టే వారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: