ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ మగాడు కాదట.. హైపర్ ఆది ఇలా అనేసాడేంటి?
అయితే హైపర్ ఆది ఉన్నాడు అంటే చాలు ఇక అటు పంచుల వర్షం కురవడం ఖాయం అని అభిమానులు కూడా భావిస్తూ ఉంటారు. ఎవరికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా తన తోటి కమెడియన్స్ పై కూడా ఎప్పుడు పంచులతో రెచ్చిపోతూ ఉంటాడు హైపర్ ఆది. అయితే కొన్ని కొన్ని సార్లు అటు హైపర్ ఆది వేసే పంచులు హద్దులు మీరి ఉంటాయి అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం డాన్స్ షో అయిన ఢీ షోలో టీం లీడర్ గా చేస్తున్నాడు హైపర్ ఆది. ఇక ఇటీవల ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. తన తోటి టీం లీడర్ గా ఉన్న జెస్సిని ఘోరంగా అవమానించే విధంగా హైపర్ ఆది పంచ్ వేయడం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ప్రోమోలో భాగంగా కొన్ని పర్ఫామెన్స్ ల తర్వాత జెస్సి, ఆది కూరగాయలు పట్టుకుని కనిపించారు. ఈ క్రమంలోని రావడం రావడమే జడ్జెస్ పై పంచులు వేస్తూ వచ్చాడు హైపర్ ఆది. ఇక ఆ తర్వాత జెస్సి తీసుకొచ్చిన కూరగాయలను ఒక్కొక్కటిగా చూపిస్తుండగా.. హైపర్ ఆది అది ఏంటి ఎవరికి సెట్ అవుతుంది అన్నది చెబుతున్నాడు. ఈ సమయంలోనే జెస్సి బెండకాయను తీసి దీనిని ఇంగ్లీషులో ఏమంటారు అన్న చెప్పు అంటూ వినయంగా అడుగుతాడు. దీన్ని జెస్సి ఫింగర్ అని అంటారు అంటూ హైపర్ ఆది పంచ్ వేస్తాడు. సాధారణంగా బెండకాయను లేడీ ఫింగర్స్ అని అంటూ ఉంటారు. అంటే ఇన్ డైరెక్ట్ గా జెస్సిని లేడీ అనేసాడు హైపర్ ఆది. దీంతో అందరూ షాక్ అయ్యారు.