ఇక టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజేటిల్లు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఎంత పెద్ద ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మాల్ బడ్జెట్ చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.పెద్ద హిట్‌గా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయిలో రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా నిర్మాతలకు ఇంకా బయ్యార్లకు భారీ లాభాలు వచ్చాయి.దీంతో చిత్ర యూనిట్ ఈ మూవీకి సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో పడింది. డీజే టిల్లు స్క్వేర్ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై చాలా కాలంగా కూడా సస్పెన్స్ కొనసాగింది. అయితే చిత్ర యూనిట్ ఎట్టకేలకు ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.ఇప్పటికే అనుపమ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం అనుపమ టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా అనుపమ పుట్టిన రోజు సందర్భంగా మూవీ యూనిట్ మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. టిల్లు స్వ్కేర్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక అనుపమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మూవీ యూనిట్ ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో అనుపమ చబ్బీ అండ్ హాట్ లుక్స్‌లో అనుపమ ఆకట్టుకుంటోంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా శ్రీలీల, మడోన్నా సెబాస్టియస్, మీనాక్షి చౌదరి వంటి పేర్లు వినిపించినా మొదట అనుకున్న అనుపమనే ఫైనల్ గా హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలిని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పీడీవి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ట్‌టైనమెంట్స్ ఇంకా ఫార్చ్యూన్ ఫోర్ స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. మరి ఈ డీజే టిల్లును మించిన విజయాన్ని ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.