భారీ అంచనాల మధ్య విడుదల కి సిద్ధం అవుతున్న 'దసరా '.....!!
దీనికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలంగాణలోని సింగరేణి కాన్సెప్ట్ తో సాగే రా అండ్ రస్టిక్ ఫిల్మ్ ఇది.
ఇందులో నాని ఇంతకీ ముందు ఎపుడు చేయని విధంగా కనిపించనంత ఊరమాస్ లుక్ లో అలరించబోతున్నాడు. మార్చ్ నెలలో ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం భారీగా విడుదల కాబోతోంది. ఐతే ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మూవీస్ పై భారీ అంచనాలను క్రియేట్ చేశారు. ఐతే ఈ సినిమా పోస్టర్స్ లో ప్రముఖ నటి సిల్క్ స్మిత ఫోటోను బాగా ఎలివేట్ చేస్తున్నారు. ఐతే అసలు ఈ మూవీ `దసరా`తో సిల్క్ స్మితకు ఉన్న రిలేషన్ ఏంటి అన్నది చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న.
ఐతే ఇండస్ట్రీ వర్గాల నుండి మనకు ఉన్నా సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం సిల్క్ స్మిత చుట్టూ తిరుగుతుందట.ఐతే ఆమె పేరిట ఒక బార్ కూడా ఉంటుందట. ఐతే అందులో నానితో పాటు మరో గ్యాంగ్ కూడా రెగ్యూలర్గా ఆ బార్ కు వస్తూ ఉంటారంట. అయితే ఈ రెండు గ్రూపులకు మధ్య గొడవ జరుగుతుందని, దీనికి కారణంగా అంతా రెండుగా విడిపోయి కొట్టుకుంటుంటారని, మరి ఆ గొడవేంటి? ఎందుకు గొడవ పడ్డారు, ఐతే దాంట్లో స్కిల్ స్మిత్ హోటల్ పాత్ర ఏంటి? నాని ఏం చేశాడనేది చిత్ర కథగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇందులో సింగరేణి ఏరియాలో ప్రాంతం లో జరిగే గొడవలు, అక్కడి జనం పాటించే ఆచారాలు, పద్ధతులు వంటివి అనేవి వెండితెర మీద అద్దం పట్టేలా ఉంటాయని డైరెక్టర్ శ్రీకాంత్ ఓడేలా ఈ మూవీ ని తీర్చి దిద్దాడని సమాచారం.