త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా టైటిల్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?

frame త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా టైటిల్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అంతేకాదు ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కనుంది. మహేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే మరియు శ్రీ లీల నటిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాని తన స్టైల్ లో ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమాని రూపొందిస్తున్నారు.

 త్రివిక్రమ్ మరియు మహేష్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమా తర్వాత కచ్చితంగా రెండేళ్ల సమయం తర్వాత రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మహేష్ అభిమానులు త్వరలోనే తన తదుపరి సినిమాపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అనే చెప్పాలి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని  మార్చ్ లో ఉగాది సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి ఎన్నడూ లేని విధంగా ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ని కూడా త్రివిక్రమ్ తన స్టైల్ లో ఉండేటట్టు ఇప్పటికే ప్లాన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ వార్త విన్న మహేష్ అభిమానులు ఈ సినిమా టైటిల్

ఎలా ఉంటుంది అనే దాన్నిబట్టి ఈ సినిమా రిజల్ట్ చెప్పొచ్చు అన్నంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ తో త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను ఎంతలా ఆకట్టుకుంటాడో అన్నది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన అతడు, ఖలేజా సినిమాలో ఎందుకు ఈ విషయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడే త్రివిక్రమ్ మహేష్ తో రెండు ప్రయోగాత్మక సినిమాలో చేశాడు కాబట్టి ఈసారి కూడా మహేష్ బాబుతో ఒక కొత్త ప్రయోగం చేసాడు. దీంతో గతంలో వచ్చిన రెండు సినిమాల లాగా ఈ సినిమా కూడా అదే రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: