వైరల్ : ఉప్పెన బ్యూటీ.. కృతి శెట్టి సూపర్ డాన్స్?

frame వైరల్ : ఉప్పెన బ్యూటీ.. కృతి శెట్టి సూపర్ డాన్స్?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అటు సినీ సెలెబ్రెటీలకి ప్రేక్షకులకి మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు సినీ సెలెబ్రిటీలను చూడడమే మహా గొప్ప అని అనుకునేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా కారణంగా నేరుగా సినీ సెలబ్రిటీలతోనే మాట్లాడగలుగుతూ ఉన్నారు. అంతేకాదు ఇక తమ అభిమాన హీరో హీరోయిన్లు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎలాంటి సినిమాల్లో నటిస్తున్నారు? అన్న విషయాన్ని కూడా ఇట్టే సోషల్ మీడియా ద్వారా తెలుసుకోగలుగుతున్నారు.

 మరోవైపు సినీ సెలబ్రిటీలు సైతం సినిమాల హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తమ పాపులారిటీని అంతకంతకు పెంచుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది హీరోలు సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోలను పోస్ట్ చేయడం లేదంటే.. ఏదైనా డాన్స్ వీడియోలు పోస్ట్ చేయడం చేసి అభిమానులను అలరిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కృతి శెట్టి డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఉప్పెన సినిమా సూపర్ హిట్ తర్వాత వరుస విజయాలతో సత్తా చాటింది కృతి శెట్టి. కానీ గత ఏడాది బంగారు రాజు మినహా మిగతా మూడు సినిమాలు కూడా ఫ్లాప్ గానే మిగిలిపోయాయి. దీంతో కృతి కెరియర్ కాస్త స్లో అయింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు నాగచైతన్యకు జంటగా కస్టడీ సినిమాలో నటిస్తోంది. శర్వానంద్ తో ఒక సినిమా తో పాటు మలయాళం లో కూడా సినిమా చేస్తుంది. ఇక సినిమాల గురించి పక్కన పెడితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే ఉంటుంది. ఇకపోతే ఇటీవలే టైట్ డ్రెస్ వేసుకొని వారసుడు సినిమాలోని డ్యూయెట్ సాంగ్ పై కిరాక్స్ చెప్పులు వేసింది కృతి శెట్టి. ఇది చూసి అభిమానులందరూ మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: