అందాల నటి శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్. హీరోయిన్గా బాలీవుడ్ ని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె గత ఐదు సంవత్సరాలుగా బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్ లో నటన అద్భుతంగా ఉండడంతో టాలీవుడ్ లో కూడా ఈమెకి చాలా అవకాశాలు వచ్చినప్పటికీ రిజెక్ట్ చేసింది జాన్వి కపూర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ విషయాన్ని ఎన్టీఆర్ థర్టీ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ జాన్వి కపూర్ కి సంబంధించిన సినిమాలోని ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా
ద్వారా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది అని అందరూ అనుకుంటున్నారు .కానీ జాన్వికాపూర్ మాత్రం ఎన్టీఆర్ 30 కన్నా ముందే ఒక తెలుగు సినిమాలో స్టార్ హీరోతో నటించిన సంగతి చాలా మందికి తెలియదు కావచ్చు. ఈ నేపథ్యంలోనే జాన్వీకపూర్ ఈ సినిమా కంటే ముందే నటించిన ఆ సినిమా ఏంటా అని అందరూ ఆరాతీస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ పార్టీ సినిమా కంటే ముందే జాన్వి కపూర్ రానా దగ్గుపాటి మరియు విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించిన జరిగింది. మార్చి 10 నుండి నెట్ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రానా నాయుడు సీరియస్ ని ప్రొడ్యూస్ చేసిన నెట్ఫ్లిక్ సంస్థ వారు జాన్వి కపూర్ కి
సంబంధించిన ఒక సీన్ ని రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. మార్చి 6వ తేదీన జాన్వి కపూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పార్టీ సినిమా నుండి మరియు రానా నాయుడు నుండి ఒకేసారి అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. రానా మరియు వెంకటేష్ నటించిన ఈ సిరీస్ ని పాత ఇండియా లెవెల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ఈ సీరియస్ లో రానా బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇలాంటి ఆపద వచ్చినా కూడా ఆదుకునే పాత్రలో మనందరికీ కనిపిస్తాడు. అయితే తాజాగా జాహ్నవి కపూర్ పుట్టినరోజు సందర్భంగా ప్రాబ్లమ్ లో ఉన్న తనని రానా కాపాడినట్లుగా ఒక ప్రోమో ని విడుదల చేశారు .అయితే మొత్తానికి జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ 30 సినిమా కంటే ముందే ఒక తెలుగు స్టార్ హీరోతో కలిసి నటించడంతో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు..!!