సీనియర్ హీరోయిన్ లయ.. అంబానీకి చెల్లెలు అవుతుందా?
కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒకటి రెండు సినిమాలతోనే చాలా ఫేమస్ అయ్యి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అలాంటి వారిలో లయ కూడా ఒకరు అని చెప్పాలి. స్వయంవరం అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత దాదాపు 30 కి పైగా సినిమాల్లో నటించింది. ఇక ఈమె నటించిన సినిమాల్లో చాలానే హిట్ సినిమాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇక స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలుతుంది అనుకున్నప్పటికీ కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే ఎన్నారై డాక్టర్ గణేష్ ని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయింది.
ఇకపోతే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తన కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనను అందరూ కూడా కోటీశ్వరురాలిని అని అనుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే అవును నేను అంబానీ చెల్లెల్ని అంటూ సరదాగా నవ్వుతూ చెప్పేసింది లయ. అయితే లయ ఇంటర్వ్యూలో సరదాగా అన్న మాటలను కొంతమంది మాత్రం సీరియస్గా తీసుకున్నారు. నిజంగానే లయ అంబానీ చెల్లెలు అయి ఉండొచ్చు అంటూ ఇక సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు