తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న ప్రియదర్శి తాజాగా బలగం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ మూవీ లో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించగా ... కమీడియన్ వేణు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. కెరియర్ లో మొట్ట మొదటి సారి మూవీ కి దర్శకత్వం వహించిన వేణు ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.
మూవీ ద్వారా వేణు కి దర్శకుడుగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ కూడా లభించింది. కొంత కాలం క్రితమే పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన బలగం సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వస్తున్నాయి. ఇప్పటికి కూడా ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఇప్పటికే ఎంతో మంది ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.
అలాగే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాపై ... ఈ సినిమా బృందానిపై ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా మాస్ మహారాజ రవితేజ కూడా బలగం మూవీ యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా రవితేజ బలగం మూవీ గురించి స్పందిస్తూ ... కుటుంబం ఐక్యత గురంచి బలగం మూవీ లో చాలా చక్కగా చిత్రికరించారు. వేణు కొత్త డైరక్టర్ గా చాలా గ్రేట్ జాబ్ చేశారు. ప్రియదర్శి , కావ్య కళ్యాణ్ రామ్ తదితరులు చేసిన అద్భుతమైన నటనకు అభినందనలు, భీమ్స్ కచ్చితం గా సినిమాకి హార్ట్, అంటూ రవితేజ చెప్పుకొచ్చారు. అలాగే ఇలాంటి మంచి కథలకు సపోర్ట్ ఇస్తున్న నిర్మాత దిల్ రాజు, హన్షిత, హర్షిత్ రెడ్డి లకు హ్యాట్సాఫ్ అని రవితేజ అన్నారు.