రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ అనే మూవీ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అవుతున్న ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి కేవలం ప్రభాస్ కు సంబంధించిన ఒక పోస్ట్ పోస్టర్ ను మరియు ఒక టీజర్ ను మాత్రమే విడుదల చేసింది ఆ విడుదల చేసింది.
ఈ టీజర్ కు కూడా ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ లభించింది. దానితో ప్రస్తుతం మళ్ళీ ఈ మూవీ యూనిట్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టింది అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఫుల్ స్పీడ్ లో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి ఎన్ని రోజులు అవుతున్న ఈ మూవీ విడుదల కాకపోవడానికి ప్రధాన కారణం ఈ మూవీ కి అత్యంత భారీ "వి ఎఫ్ ఎక్స్" ఉండడమే. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ మూవీ విడుదల కావడానికి ఇంకా మూడు నెలల సమయం కూడా లేదు. కానీ ఇప్పటి వరకు కూడా ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్ లను ఈ చిత్ర బృందం మొదలు పెట్ట లేదు. కానీ ఈ మూవీ యూనిట్ మాత్రం ఈ సినిమాను కచ్చితంగా జూన్ 16 వ తేదీనే విడుదల చేయనున్నట్లు డిస్ట్రిబ్యూటర్ లకు చెబుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సంవత్సరం శ్రీరామనవమి నుండి అయిన ఈ సినిమా ప్రమోషన్ లను ఈ చిత్ర బృందం మొదలు పెడుతుందో ... లేదో చూడాలి. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.