విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ గా నిలిచిన దాస్ కా దమ్కి..!

frame విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ గా నిలిచిన దాస్ కా దమ్కి..!

Pulgam Srinivas
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి నటుడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ యువ హీరో తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో క్లాస్ మూవీ లలో నటించి క్లాస్ ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా ... ఎన్నో మాస్ మూవీ లలో నటించి మాస్ ప్రేక్షకులను కూడా ఎంత గానో ఆదరించాడు. ఇలా ఇప్పటికే క్లాస్ మరియు మాస్ మూవీ లతో ప్రేక్షకులను అలరించిన ఈ యువ నటుడు తాజాగా దాస్ కా దమ్కి అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు

ఈ మూవీ లో విశ్వక్ హీరో గా నటించిన మాత్రమే కాకుండా స్వయంగా ఈయనే ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. నివేదా పేత్ రాజ్ ఈ సినిమాలో విశ్వక్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నిన్న అనగా మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ సినిమాకు ఫస్ట్ డే అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభించాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ లను సంబంధించిన అప్డేట్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 8.88 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లుగా ... అలాగే విశ్వక్ కెరియర్ లో కూడా మొదటి రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాగా దాస్ కా దమ్కి నిలిచినట్లుగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా ఈ మూవీ తో విశ్వక్ మొదటి రోజు తన కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ లను అందుకున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: