కమల్ హాసన్ కొత్త మూవీ వివాదాలకు దారి తీయనుందా..?

frame కమల్ హాసన్ కొత్త మూవీ వివాదాలకు దారి తీయనుందా..?

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకం గా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కమల్ ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన విజయవంత మైన మూవీ లలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు . అలాగే తన నటనతో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించు కున్నాడు. ఇది ఇలా ఉంటే చాలా కాలం పాటు సరైన విజయం లేక బాక్స్ ఆఫీస్ దగ్గర డీల పడిపోయిన కమల్ పోయిన సంవత్సరం లోకేష్ కనక రాజు దర్శకత్వం లో రూపొందిన విక్రమ్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు .

ఇలా విక్రమ్ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో రూపాందుతున్న ఇండియన్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . కొంత కాలం పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది . ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ... రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు . తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

అసలు విషయం లోకి వెళితే ఈ మూవీ లో రాజకీయాలకు సంబంధించి చాలా డైలాగ్ లను కమల్ చెప్పబోతున్నట్లు ముఖ్యంగా సౌత్ రాజకీయ నాయకుల పై కూడా కమల్ వ్యక్తిగతంగా విమర్శలు చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇండియన్ 2 మూవీ ప్రస్తుతం అద్భుతంగా వస్తున్నట్లు తెలుస్తోంది . ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: