అల్లరి నరేష్ ను ఇబ్బంది పెట్టిన ఉగ్రం !
గతంలో సమ్మర్ సీజన్ వచ్చింది అంటే చాలు అల్లరి నరేష్ నుండి ఒక కామెడీ సినిమా సమ్మర్ రేస్ లో ఉండటమే కాకుండా ఆమూవీ ఖచ్చితంగా హిట్ అయ్యేది. అయితే ఈ అల్లరోడి కామెడీ రొటీన్ గా మారిపోవడంతో ప్రేక్షకులకు మొహం మొత్తి వరసగా అతడి సినిమాలు ఫ్లాప్ అవ్వడం జరిగింది. దీనితో జరుగుతున్న పొరపాటును గ్రహించిన నరేష్ తన యాక్షన్ స్టైల్ ను మార్చుకుని ప్రస్తుతం సీరియస్ మూవీలను చేయడం మొదలుపెట్టాడు.
ఈ ప్రయత్నంలో భాగంగా కరోనా పరిస్థితుల ముందు విడుదలైన ‘నాంది’ ఈ హీరో ఇమేజ్ ని పూర్తిగా మార్చి వేసింది. గత సంవత్సరం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సీరియస్ మూవీని చేసినప్పటికీ ఆసినిమా సగటు ప్రేక్షకుడుకి పెద్దగా నచ్చలేదు. దీనితో ‘నాంది’ మూవీతో తనకు హిట్ ఇచ్చిన విజయ్ కాంబినేషన్ లో ‘ఉగ్రం’ మూవీగా మే మొదటివారంలో వస్తున్నాడు. ఈమూవీ గోపీ చంద్ ‘రామబాణం’ తో పోటీ పడుతోంది.
ఒక వాస్తవ కథను ఆధారంగా చేసుకుని నరేష్ ఈమూవీలో చాల సీరియస్ గా కనిపిస్తాడు. ఈసినిమా కోసం నరేష్ ఏకంగా 500 సిగరెట్లు కేవలం నాలుగు తాగవలసి వచ్చిందట. చాల రెక్లెస్ గా కనిపించే పాత్ర కావడంతో నరేష్ సహజత్వం కోసం రియల్ సిగరెట్లు తాగవలసి వచ్చిందట. సిగరెట్లు తాగే అలవాటు లేని నరేష్ ఇలా ఒక్కసారి నాలుగు రోజులలో 500ల సిగరెట్లు కాల్చడంతో షూటింగ్ పూర్తి అయి తన హొటల కి వచ్చేడప్పటికీ తన నోరు అంతా అదోలా తయారు కావడమే కాకుండా తన ఆరోగ్యం కూడ దెబ్బతినడంతో తాను తిరిగి కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టింది అని అంటున్నాడు.
యంగ్ హీరోల హవా పెరిగి పోవడంతో నరేష్ గోపీ చాంద్ ల కెరియర్ సజావుగా సాగడం లేదు. దీనికితోడు వీరిద్దరి సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండటంతో వీరి మార్కెట్ కూడ బాగా దెబ్బ తింది. ఇలాంటి పరిస్థితులలో ఈ ఇద్దరు ఫెయిల్యూర్ హీరోలు ఒకే రోజున ఒకరి పై ఒకరు పోటీ పడటం షాకింగ్ గా మారింది..