సమంత చెప్పుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!!

frame సమంత చెప్పుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!!

murali krishna
సమంత వరుస సినిమాల తో చాలా బిజీగా ఉంది.ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా టాలీవుడ్‌, బాలీవుడ్ మధ్య తెగ తిరిగేస్తుంది.తెలుగులో ఖుషి సినిమాతో పాటు బాలీవుడ్‌ లో సిటాడెల్ వంటి వెబ్‌సిరీస్‌లో కూడా నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్‌లను ఒకే సమయంలో పూర్తి చేయాలనే ఆలోచనలో కూడా ఉంది. అందుకే విరామం లేకుండా సమంత కష్టపడుతోన్నట్లు ఆమె స్నేహితులు కూడా చెబుతోన్నారు.
కాగా ఈ బిజీ షెడ్యూల్స్  వల్ల చిన్న బ్రేక్ రావడం తో సమంత విదేశాలకు విహారయాత్రలకు వెళ్లినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఆదివారం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సమంత కనిపించిన ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతోన్నాయి.
ఈ ఫొటోల్లో వైట్ పాంట్‌, బ్లాక్ టాప్‌తో ధరించి సమంత కనిపించిందటా.. హుడీ జాకెట్‌ను నడుముకు కట్టుకొని స్టైలిష్‌లుక్‌లో అభిమానులకు దర్శనమిచ్చింది. అంతే కాకుండా లూయిస్ వూయిట్టన్ బ్రాండ్‌కు చెందిన స్లైడ్ మోడల్ చెప్పులను కూడా సమంత ధరించింది.
సమంత ధరించిన ఈ చెప్పుల కాస్ట్ దాదాపు 2500 డాలర్లు పైనే ఉంటుందని తెలుస్తుంది.. ఇండియన్ కరెన్సీలో రెండు లక్షల ఆరు వేలకు పైమాటే అని చెబుతోన్నారు. సమంత చెప్పుల ధర విని నెటిజన్లు కూడా షాక్ అవుతోన్నారు.
కాగా ఖుషి సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్నాడు. కశ్మీర్ బ్యాక్‌ డ్రాప్‌లో ప్యూర్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్నాడటా.
ఇందులో సమంత ముస్లిం యువతి పాత్రలో కనిపించబోతున్నదని సమాచారం.మరోవైపు సిటాడెల్ వెబ్‌సిరీస్‌లో యాక్షన్ రోల్‌లో సమంత నటిస్తోందటా.. వీటితో పాటు తెలుగులో నందినిరెడ్డి దర్శకత్వం లో సమంత ఓ సినిమా చేయబోతున్నట్లు గా ప్రచారం కూడా జరుగుతోంది.సమంత ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల ను చేయాలని బాగా ఫిక్స్ అయింది. దానితో పాటు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలలో కూడా నటించాలి అని అనుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: