డబ్బే డబ్బు : ఏదైతే నిజం అని భావిస్తామో అదే జరుగుతుంది !

Seetha Sailaja

ఒకసారి విశ్వవిజేత నెపోలియన్ మాట్లాడుతూ ‘భావనా శక్తి విశ్వాసాన్ని పరిపాలిస్తుంది’ అంటూ కామెంట్స్ చేసారు. అదే ధోరణిలో విఖ్యాత హెన్రీవార్డ్ బీచర్ ‘భావరహితమైన ఆత్మ దూరదర్శిని లేని గ్రహ పరిశోధన లాంటిది’ అని అభిప్రాయ పడ్డారు. దీనితో ఒక మనిషి విజయాన్ని ప్రభావితం చేసే శక్తులలో మనసుకు ఉన్న అద్వితీయ శక్తి అర్ధం అవుతుంది.


మనం దేనిని అయితే నిజం అని భావిస్తామో అది ఎప్పటికీ మన మనసులోనే ఉండి మన ఆలోచనలు ప్రభావితం చేయడమే కాకుండా మన విధిని నిర్ణయించే శక్తులుగా ఆ ఆలోచనలు మారుతాయని అనేక పరిశోధనలు కూడ అంగీకరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పారిశ్రామిక వేత్త ఫోర్డ్ తన జీవిత చరిత్ర వ్రాస్తూ తాను తన చిన్నతనంలో ఒక దుకాణంలో తన జీవితాన్ని ప్రారంభించినప్పుడు తాను ప్రతిరోజు కనీసం 15 నిముషాల పాటు పెద్దపెద్ద కార్ల కంపెనీల దగ్గరకు వెళ్ళి ఆ కంపెనీలను బయట నుండి చూసిన విషయాన్నీ బయటపెట్టారు.


అలా దూరం నుంచి చూసినా తాను చూసిన ఆ కార్ల కంపెనీలు తన ఆలోచనల పై విపరీతంగా ప్రభావితం చేసి తాను కూడ ఒక పెద్ద కార్ల కంపెనీ పెట్టేలా ప్రభావితం చేసిన విషయాన్ని తెలియచేసాడు. అందువల్ల ఏవ్యక్తి వ్యాపారం చేసినా తమ ఆర్ధిక వ్యవహారాలలో విజయాన్ని ఊహించుకుంటూ మొదలు పెట్టాలని ముందుగానే నష్టాలను ఊహించుకుంటే ఖచ్చితంగా నష్టాలు వస్తాయి అని ఫోర్డ్ అభిప్రాయం.


అంతేకాదు ప్రతి వ్యక్తి తనలో ఒక రూప శిల్పి వాస్తు శిల్పి ఆలోచనా మేధావి ఉన్నాడని భావించ గలిగితే ఖచ్చితంగా ఈ లక్షణాలు ఎంతోకొంత ప్రతి వ్యక్తికి అలవడుతాయి అంటూ ఫోర్డ్ భావన. అందుకే ఊహ సంపదను కురిపిస్తుందని అందువల్ల పుట్టుకతో ధనవంతులు కాలేకపోయినా ఊహలలో సంపన్నులుగా ఉన్న వారి దగ్గర మాత్రమే ఐశ్వర్యం దరి చేరుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: