డబ్బే డబ్బు : బ్యాంకింగ్ వ్యవస్థ రూపు రేఖలను మారుస్తున్న కరోనా !
కరోనా ప్రభావంతో అనేక రంగాలలో ఊహించని మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్ వ్యవస్థలో కూడ అనేక విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా సమస్య కనీసం మరొక సంవత్సరంపాటు కొనసాగుతుంది అన్న సంకేతాలు రావడంతో ఎక్కువమంది ఖాతాదార్లు బ్యాంక్ లకు రాకుండానే తమ లావాదేవీలను చాల సులువుగా నిర్వహించుకునే కొత్త పద్ధతుల కోసం బ్యాంకింగ్ సంస్థ ప్రతినిధులు అనేక ఐటి కంపెనీలతో చర్చలు చేస్తున్నాయి.
మరో రెండు సంవత్సరాల వరకు అన్ని బ్యాంక్ లు తమ శాఖల విస్తరణ కార్యక్రమాన్ని వాయిదా వేసి కాంటాక్ట్ లెస్ బ్యాంకింగ్ దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికోసం ప్రస్తుతం అనేక బ్యాంక్ లు ఇంటరాక్టివ్ టెల్లర్ మిషన్ లను అభివృద్ధి చేసే ఆలోచనలు బ్యాంక్ లు చేస్తున్నాయి. బ్యాంక్ లకు వెళ్ళకుండా ఖాతార్లు తమ బ్యాంకర్లతో లైవ్ ఛాట్ కు వీలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న బ్యాంక్ శాఖలలో ఇక పై చాల తక్కువ మంది వ్యక్తులతో ఎక్కువ సాంకేతికత తో నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పై భారీ విత్ డ్రాయల్స్ డిమాండ్ డ్రాప్స్ కోసం బ్యాంక్ లకు వెళ్ళకుండా బ్యాంక్ ప్రతినిధులు ఖాతాదార్ల ఇళ్ళకు వచ్చి సేవలు అందించే కార్యకలాపాలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఏటిఎమ్ లు పద్ధతి మార్చి ఇంటరాక్టివ్ ఏటీఎమ్ లుగా మారబోతున్నాయి.
ముఖ్యంగా ఈ విషయాల పై గ్రామాలలో గ్రామీణ ప్రజానీకానికి అవగాహన కల్పించదానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడ చేస్తున్నారు. రానున్న రోజులలో 2000 వేల చదరపు అడుగుల నుండి 400 వందల చదరపు అడుగుల వైశాల్యంతో ఉండే బ్యాంక్ శాఖలు మాత్రమే కనిపించబోతున్నాయి. అయితే ఇప్పటికీ ఇండియాలో నిరక్షరాస్యుల సంఖ్య దేశ జనాభాలో సుమారు 50 శాతం ఉన్న పరిస్థితులలో బ్యాంకింగ్ రంగంలో వస్తున్న ఈ విప్లవాత్మక మార్పులు మరిన్ని సైబర్ నేరాలకు కారణం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనితో రానున్న రోజులలో మన బ్యాంక్ ఖాతాలను కూడ పరిరక్షించుకోవడం కూడ ఒక ఆర్ట్ గా మారే ఆస్కారం ఉంది..