డబ్బే డబ్బు : స్టాక్ మార్కెట్ లో పెరిగిపోతున్న యువ తరంగం !

Seetha Sailaja

ప్రస్తుతం కరోనా సమస్యలతో క్యాంపస్ ప్లేస్ మెంట్లు లేవు. కొత్త ఉద్యోగాల కోసం కాంపిటీటివ్ పరీక్షలు లేవు. దీనితో మనదేశంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అనేకమంది యువతీ యువకులు నిరాశకు లోనుకాకుండా కేవలం 2 లక్షల నుండి 5 లక్షల డబ్బుతో స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్న పరిస్థితులలో కేవలం గత నాలుగు నెలలలో స్టాక్ మార్కెట్ లో ఎంటర్ కావడానికి సుమారు 12 లక్షలకు పైగా కొత్త ఖాతాలు ఓపెన్ కావడంతో ప్రస్తుతం స్టాక్ మార్కెట్ కు సంబంధించి దేశ వ్యాప్తంగా ఓపెన్ అయిన డీమ్యాట్ ఖాతాల సంఖ్య 42 లక్షలకు చేరుకోవడం స్టాక్ మార్కెట్ బిజినెస్ ను విశ్లేషిస్తున్న వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.


ప్రస్తుతం ఈ స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవుతున్న వారి వయస్సు 30 సంవత్సరాల లోపే ఉండటంతో ప్రస్తుత వ్యతిరేక పరిస్థితులలో కూడ స్టాక్ మార్కెట్ కు చెందిన బి ఎస్ యి – ఎన్ ఎస్ యి లో రోజువారి సగటు టర్నోవర్ 8 వేల 200 కోట్ల నుండి 12 వేల 602 కోట్లకు పెరగడంతో ప్రస్తుతం స్టాక్ మార్కెట్ వర్గాలు చిన్నచిన్న ఒడుడుకులు వచ్చినా చాలామంది జోష్ లో ఉన్నారు. దాదాపు గత నాలుగు నెలలుగా చాల మంది ఐటి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉండటంతో చాలామందికి సమయం దొరికి ఇలా స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయి తమకు తాముగా ఆన్ లైన్ ట్రేడింగ్ చేసుకుంటూ ఉండటంతో మొదట్లో కరోనా ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్ పతనం అయినా ఇప్పుడు చాలావరకు పుంజుకుంది అన్న సంకేతాలు వస్తున్నాయి.


అయితే ప్రస్తుతం మార్కెట్ లోకి వచ్చిన ఈ యువత అప్రమత్తంగా లేకపోతే కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన వారికి నష్టాల బాటపట్టే ఆస్కారం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు చాలామంది యువత తమ దగ్గర ఉన్న డబ్బును అంతా ఒకేసారి స్టాక్ మార్కెట్ లో పెడుతున్నారని ఇలా పెట్టడం మంచిది కాదని దశల వారీగా పెట్టుబడులు పెట్టమని నిపుణులు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం కుర్రకారులో కొనసాగుతున్న ఈ హుషార్ వారందరికీ ఉద్యోగాలు వచ్చేదాకా కొనసాగే ఆస్కారం ఉంది అని అంటున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: