డబ్బే డబ్బు : అంబానీతో జట్టుకడుతున్న బెజోస్ మారుతున్న సమీకరణాలు !

Seetha Sailaja

ప్రపంచ కుబేరులు జెఫ్ బెజోస్ ముఖేష్ అంబాని చేతులు కలిపితే భారతీయ పారిశ్రామిక రంగంలో వచ్చే అనూహ్యమైన మార్పులు ఎవరి ఊహలకు కూడ అందవు. అయితే త్వరలో వీరిద్దరి మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరి తద్వారా బెజోస్ రిలయన్స్ రిటైల్ కు సంబంధించిన వాటాలలో 9.9 శాతం కొనుగోలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాధమీక చర్చలు వీరిద్దరి మధ్య పూర్తి అయినట్లు టాక్.


ఈమధ్య అంబాని తన రిలయన్స్ ఇండస్ట్రీలోని డిజిటల్ సేవల విభాగానికి సంబంధించిన వాటాలో 32.84 శాతం విక్రయించడం ద్వారా అంబానికి 1,52,000 ల కోట్లు ఆదాయం వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో రిలయన్స్ కు 48వ స్థానం దక్కింది. ఈ నేపధ్యంలో అంబాని కంపెనీలో బెజోస్ పెట్టుబడులు పెట్టడంతో భవిష్యత్ లో అనేక కీలక మార్పులు రాబోతున్నాయి.


ప్రస్తుతం అంబాని రిలయన్స్ కు ఉన్న క్రేజ్ తో బెజోస్ రిలయన్స్ రిటైల్ లో వాటాల కొనుగోలుకు అత్యంత భారీ మొత్తాన్ని చెల్లించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో కేంద్రప్రభుత్వం రైళ్ళను కూడ ప్రవేటు పరం చేయబోతున్న నేపధ్యంలో ఈ రంగంలో కూడ భారీ పెట్టుబడులు పెట్టడానికి ముకేష్ అంబాని అనుసరిస్తున్న వ్యూహాలలో భాగంగానే అంబాని బెజోస్ ల కలయిక అని అంటున్నారు.


ఇది ఇలా ఉండగా అతి త్వరలో కలవబోతున్న అమెజాన్ రిలయన్స్ సంస్థల వ్యూహాత్మక కలయిక ఒప్పందంతో అమెజాన్ మరింత వేగంగా గ్రామీణ ప్రాంతంలో కూడ చొచ్చుకు పోవడానికి ఈ వ్యూహాత్మక ఒప్పందం మరింత సహకరిస్తుంది అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. భారతదేశ కంపెనీలలో రిలయన్స్ 13 లక్షల కోట్ల విలువతో తన నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగీస్తూ ఉండటంతో రిలియన్స్ తో పోటీ ఇవ్వగల బడా కంపెనీలు ఇప్పట్లో రిలయన్స్ స్థాయికి చేరుకోవడం కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: