డబ్బే డబ్బు : కరోనా కాలంలో నోట్లకు తగ్గిన డిమాండ్ !

Seetha Sailaja
కోవిడ్ కారణంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో కరెన్సీ నోట్లకు డిమాండ్ తగ్గడంతో క్రితం ఏడాదితో పోలిస్తే కొత్త నోట్లను ముద్రణ చేయమని రిజర్వ్ బ్యాంక్ కు వచ్చే ఇండెంట్ 23.3 శాతం పడిపోయిందని ఆర్బీఐ గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఆర్ధిక వ్యవస్థ మందగమనంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఇలా నోట్లకు డిమాండ్ తగ్గడంతో నోట్ల ప్రింటింగ్ ఖర్చు తగ్గినట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంటోంది.

దీనికితోడు 2 వేల నోటు వాడకం ఈ కరోనా కాలంలో బాగా తగ్గడంతో వీటిని ముద్రించమని బ్యాంక్ లు అడగకపోవడంతో 2 వేల నోట్ల ముద్రణ ఈ కరోనా కాలంలో ఆపివేయడం జరిగిందని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. అయితే ఎవరు ఊహించని ఒక అనూహ్య పరిణామం ఈ కరోనా కాలంలో జరిగినట్లు తెలుస్తోంది. నకిలీ నోట్లలలో 2 వేల రూపాయల నకిలీ బాగాతగ్గి ఫేక్ నోట్లకు సంబంధించి 2 వందలు 5 వందల నోట్లకు సంబంధించి నకిలీ నోట్ల చలామణి పెరిగినట్లు ఆర్బీఐ గుర్తించింది.

ఇక ఇదే సమయంలో డిజిటల్ చెల్లింపు వచ్చిందని దీనిద్వారా ప్రభుత్వానికి జిఎస్టీ చెల్లింపుల ఎగవేత కొంత వరకు కట్టడి చేయడం జరిగిందని ఆ అధ్యయనం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులలో ఆర్ధిక వ్యవస్థ గాడిన పడాలి అంటే విస్తృతమైన సంస్కరణలు అవసరం అన్న అభిప్రాయం ఈ నివేదిక తెలియచేస్తోంది.

అయితే ఆహార తయారీ వస్తువుల సరఫరాలో విపరీతమైన అవాంతరాలు రానున్న రోజులలో రాబోతున్నాయని దీనివల్ల ఇంకా ధరలు పెరుగుతాయని ఈ నివేదిక హెచ్చరికలు ఇస్తోంది. అంతేకాదు బ్యాంక్ లలో జరిగే మోసం పసిగట్టడానికి 2 సంవత్సరాలు పడుతున్న పరిస్థితులలో ఈ వ్యవస్థను సక్రమమైన క్రమపద్ధతిలో పెట్టాలి అంటే బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావాలని సూచిస్తూ భారతదేశంలో ఆహార రంగానికి సంబంధించి అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి పూర్తి దృష్టి పెట్టకపోతే అనేక పెను సమస్యలు వస్తాయని ఈ నివేదిక ప్రభుత్వానికి సూచనలు ఇస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: