డబ్బే డబ్బు : రికార్డు స్థాయిలో పడిపోయిన జిడిపి !

Seetha Sailaja

కరోనా పరిస్థితుల వల్ల భారత ఆర్ధికవ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుంది అన్న అంచనాలు వచ్చినా ఆ అంచనాలకు మించి ఏప్రియల్ – జూన్ త్రైమాసికానికి సంబంధించి భారత జిడిపి 23.9 శాతం పడిపోవడమే కాకుండా 40 సంవత్సరాల తరువాత ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఇప్పుడు పారిశ్రామిక వర్గాలను కలవర పెడుతోంది.

సుమారు 8.5 లక్షల కోట్ల బిజినెస్ ఈకరోనా పరిస్థితులు వల్ల తగ్గిపోయింది అనీ దీనిప్రభావం వల్ల రానున్న రోజులలో మరింత గడ్డుకాలం పొంచి ఉందని ఆర్ధిక శాస్త్రవేత్తలు హెచ్చరికలు ఇస్తున్నారు. ఈపరిణామాలు వల్ల పన్నులు ఆదాయం కూడ కేంద్రప్రభుత్వానికి బాగా తగ్గిపోతుందని దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రప్రభుత్వం భవిష్యత్ లో ఆర్ధికసహాయం చేయలేదు అన్నసంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాణ సేవా రంగాలలో వృద్ధిరేటు విపరీతంగా క్షీణించడంతో జిడిపి లో ఇలాంటి క్షిణత వచ్చింది అన్నసంకేతాలు వస్తున్నాయి.

అయితే ఇంత కారుచీకటిలో కాంతికిరణంగా వ్యవసాయ రంగంలో అభివృద్ధి నమోదు చేసుకోవడం శుభసూచికం. వాణిజ్యం హోటల్స్ రవాణా కమ్యూనికేషన్ రియల్ ఎస్టేట్ రంగాల్లో 5.3 శాతం క్షీణత రావడంతో పాటు విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా వంటి రంగాలలో కూడా క్షీణత ఏర్పడటంతో భారతదేశ మందగమనంలో ఉంది. ఈపరిస్థితుల ప్రభావం వల్ల షేర్ మార్కెట్ లో కూడ కలకలం ఏర్పడి మరింతగా షేర్ల విలువ దిగజారడమే కాకుండా దీని ప్రభావం బంగారం పై కూడ ఉంటుంది అని అంటున్నారు.

ఇది ఇలా ఉంటే ఇండియా బోర్డర్ లో ఏర్పడ్డ టెన్షన్ వాతావరణంతో స్టాక్ మార్కెట్ ర్యాలీ మందగించింది. దీనితో ముదుపరులు షేర్లను కొనే విషయంలో ఆశక్తి కనపరచడం లేదనే సంకేతాలు వస్తున్నాయి. దీనితో ప్రస్తుత వాతావరణంలో అటు బంగారం పై ఇటు షేర్ల పై అదేవిధంగా రియల్ ఎస్టేట్ పై ఏరంగం పైనా కూడ ప్రజలకు నమ్మకం కలగకపోవడంతో ధనవంతులలో కూడ పెట్టుబడి వాతావరణం పూర్తిగా తగ్గిపోయి మనీ సర్క్యులేషన్ పడిపోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: