డబ్బే డబ్బు : మనిషి జీవితాన్ని తారుమారుచేసిన డబ్బు !

Seetha Sailaja
డబ్బు సంపాదించడమే కాదు వచ్చిన డబ్బును నిలుపుకోవడం ఒక కళ. ఈవిషయంలో ఏవ్యక్తి ఒక్క చిన్న పొరపాటు చేసినా జీవితాలు తారుమారు అయిపోతాయి అన్న విషయం సుశీల్ కుమార్ జీవితం ఒక ఉదాహరణ. విజయం మత్తులో పడి ట్రాక్ తప్పితే సమస్యల సుడిగుండంలో మనిషి చిక్కుకుని అనేక కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉందని సుశీల్ కుమార్ జీవితాన్ని పరిశీలించిన వారికి అర్ధం అవుతుంది.

‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమంలో విజేతగా మారాలి అంటే సాధారణ తెలివితేటలు ఉంటే సరిపోవు. అలాంటి షోకు సంబంధించి 2011 సీజన్ లో విజేతగా మారి 5కోట్ల ప్రైజ్ మనీ తెచ్చుకుని వచ్చిన డబ్బును అంతా పోగొట్టుకుని ఇప్పుడు ఒక స్కూల్ లో నెలకు 18,000 జీతం తీసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న సుశీల్ కుమార్ జీవితాన్ని చూస్తే డబ్బు సంపాదించడమే కాదు నిలబెట్టుకోవడం ఒక కళ అన్నవిషయం అర్ధం అవుతుంది.

సుశీల్ కుమార్ తనకు వచ్చిన డబ్బును తనకు అనుభవం లేని రంగాలలో పెట్టుబడులు పెట్టి అంతా నష్టపోయాడు. అంతేకాదు అతడు చేసిన ప్రతి వ్యాపారంలోను నష్టాలే. చేతికి అంది వచ్చిన డబ్బుతో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన రావడమే కాకుండా ముంబాయి వెళ్ళి సినిమా తీయలేక నానా ఇబ్బందులు పడుతూ అవకాశాలు రాలేదు అన్న నిరాశతో సిగరెట్లు మందుకు అలవాటుపడి తనకు ప్రైజ్ మనీగా వచ్చిన 5 కోట్ల మనీని వృథా చేసుకున్నాడు.

ఆర్ధికంగా అన్ని విధాల నష్టపోయాక తాను ఎందుకు అన్ని వ్యాపారాలు చేసాడు అన్న ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఫలానా వ్యాపారం చేస్తున్నాను అని చెప్పుకోవడానికి మాత్రమే తాను వ్యాపారాలు చేసానని తాను చేసిన ఏ వ్యాపారంలోను తనకు అనుభవంలేదు అన్నవిషయాన్ని తాను చాలఆలస్యంగా గుర్తించాను అని అంటున్నాడు. ప్రస్తుతం సిగరెట్లు మానేసి నెలకు 18 వేల జీతం కోసం ఒక ప్రవేట్ స్కూల్ లో పనిచేస్తున్న సుశీల్ కుమార్ తాను పాఠాలు చెప్పే విద్యార్ధులకు జికె చెపుతూ సరిగ్గా ఆలోచనలు చేయలేకపోతే డబ్బు మనిషి జీవితంతో ఎలా ఆటలు ఆడుకుంటుందో పిల్లలకు అర్థం అయ్యే విధంగా పాఠాలు చెపుతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: