డబ్బే డబ్బు : అదృష్టానికి చిరునామా అనంతు విజయన్ !
కేరళ రాష్ట్రంలోని ఎర్నకుళంలోని ఒక దేవాలయంలో క్లర్క్ గా పనిచేస్తున్న విజయన్ గత నెల ఒక ఏజెంట్ ద్వారా ఓనమ్ లాటరీ టిక్కెట్ ను కొన్నాడు. తనకు లాటరీలో ప్రైజ్ మనీ గెలుచుకున్న విషయం తెలియచేస్తూ ఫోన్ వస్తే ఎవరో కావాలని ఫేక్ కాల్ చేసినట్లు అతడు భావించాడట. ఆ తరువాత లాటరీ రిజల్స్ లో తన టికెట్ నంబర్ చూసి ఆశ్చర్య పోయాను అని అంటున్నాడు.
ఈ రిజల్ట్ రాకముందు విజియన్ తన స్నేహితులతో ఈసారి ఓనమ్ బంపర్ లాటరీ తన దేనని ఆ దెబ్బతో తన జీవితం మారిపోతుందని జోక్ చేసాడట. కాని ఆ జోక్ నిజం కావడం తాను ఊహించ లేకపోయాను అని అంటున్నాడు. కోవిడ్ కారణంగా తన సోదరి ఉద్యోగం కోల్పోయి పెయింటర్ అయిన తన తండ్రికి కూడ పని లేకుండా పోయింన పరిస్థితులలో ఇప్పుడు అనూహ్యం గా కలసి వచ్చిన ఈ అదృష్టంతో తన జీవితం మారిపోతుందని ప్రైజ్ మనీతో ఎర్నాకుళంలో ఒక చిన్నపాటి ఇల్లు కొనుక్కుని తన తండ్రితో కలిసి ఏదైనా వ్యాపారం పెడుతానని విజయన్ చెపుతున్నాడు.
కేరళ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం లిక్కర్ లాటరీ నుంచే వస్తుంది. రాష్ట్రంలో దాదాపు ప్రతీరోజూ ఏదో ఒక లాటరీ ఉంటుంది. ఈ టికెట్లను విక్రయించేందుకు దాదాపు 35వేల మంది ఏజెంట్స్ .5లక్షల మంది రిటైలర్ సెల్లర్స్ కేరళా అంతా విస్తరించి ఉంటారు అని ఒక అంచనా. కేరళ ప్రభుత్వానికి కేవలం లాటరీ ద్వారానే ఏటా 10 వేలకోట్ల నుంచి 12 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఒక అంచనా. ఏమైనా మరి అదృష్టం అంటే విజయన్ దే అనుకోవాలి..