డబ్బే డబ్బు : సంపదను తెచ్చిపెడుతున్న హాబీలు !
ప్రస్తుతం చాలామంది మధ్య తరగతి మహిళలు పురుషులతో సమానంగా తమ హాబీలను వృత్తిగా మార్చుకుని బాగా సంపాదిస్తూ సక్సస్ అవుతున్నారు. ఒకప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండే స్త్రీలు ఈరోజు తమ హాబీలను వాస్తవ రూపంలోకి తీసుకువచ్చి వారి హాబీలతోనే సంపద మార్గాలను అన్వేషిస్తు అనేక విజయాలను కూడ అందుకోగలుగుతున్నారు. ముఖ్యంగా ఫ్లవర్ వాజులు బొకేలు అమర్చటం తాజా పళ్లను అందంగా ఆకర్షణీయంగా బుట్టల్లో అమర్చి బర్త్ డే గిఫ్ట్ గా కార్పోరేట్ హౌస్‌లకు ఆస్పత్రులకు పంపిణీ చేయడం వంటి వ్యాపారాలలో ఎందరో మహిళలు రాణిస్తున్నారు.
టివి ఛానల్స్ పెరిగిపోవడంతో రకరకాల హాబీల పట్ల స్త్రీలలో అవగాహన పెరిగిపోతోంది. మరికొంత మంది పిల్లలకు సంగీతం డాన్స్ నర్సరీ రైమ్స్ పిల్లల కిష్టమైన వాయిద్యాలు నేర్పుతూ పెద్దపెద్ద పట్టణాలలో మాత్రమే కాకుండా చిన్నచిన్న నగరాలలో కూడ స్త్రీలు తమ హాబీలను వ్యాపారంగా మార్చుకుని ఎదుగుతున్నారు. మరికొంత మంది అయితే రకరకాల వంటలు తయారుచేసే పద్ధతిని వివరిస్తూ యూట్యూబ్ ఛానెల్స్ నడుపుతూ పేరుతో పాటు డబ్బు కూడ గణిస్తున్నారు.
ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనింగ్ గిఫ్ట్స్ మేకింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ రంగాలలో కూడ బాగా రాణిస్తున్నారు. ఇలా స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడ తమ అభిరుచిని బట్టి తాము ఎలాంటి వ్యాపార రంగానికి సరిపోతామో తెలుసుకొ గలిగినప్పుడు సంపదను సృసృష్టించడం పెద్ద కష్టం కాదు. అందువలనే ఎంచుకున్న వృత్తి పై ఆసక్తితోనే సంపదను పొందగలం..