డబ్బే డబ్బు : డేటా హబ్ గా భాగ్యనగరం !
మనకు ఏసినిమా నచ్చితే ఆ సినిమాను వెంటనే చూసేస్తున్నాము. కానీ ఇది అంతా ఎలా సాధ్యం అనీ ఎవరు ఆలోచించరు. నెట్ ఫ్లిక్స్ సంస్థ అయినా మరో ఓ టీటీ సంస్థ అయినా తమ సినిమాలను సర్వర్ లో బద్రపరుస్తుంది. అలా బద్రపరిచే విధానానికి సమాధానమే వెబ్ సర్వీస్. అమెజాన్ సంస్థ ప్రారంభించిన ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ అతి పెద్దదిగా మారడంతో అన్ని ప్రముఖ సంస్థలు తమ క్లౌడ్ కంప్యూటింగ్ సేవల కోసం అమెజాన్ వెబ్ సర్వీస్ నే ఆశ్రయిస్తున్నా యి.
ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీస్ సుమారు 20,761 కోట్లు భాగ్యనగరంలో పెట్టుబడి పెట్టి హైదరాబాద్ ను డేటా హబ్ గా మార్చబోతోంది. దీనితో అనేకవేలమందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. గతంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు వచ్చిన ఒక చిన్న ఆలోచన ఇప్పుడు మహావృక్షంలా మారింది. దేశంలోని ప్రముఖ కంపెనీలు అన్నీ కీలకమైన తమ డేటాను అమెజాన్ క్లౌడ్ ఫ్లాట్ ఫామ్ కు తరలిస్తున్నాయి.
ప్రస్తుతం అమెజాన్ సంస్థ బద్రపరచబోతున్న వివిధ కంపెనీల ఈ డేటా 120 కోట్ల డాలర్ల విలువలో ఉంటుందని ఒక అంచనా. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాలకు సంబంధించిన వివిధ కంపెనీల డేటా ను ఈ డేటా హబ్ లో బద్రపరచబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విదేశ సంస్థలకు సంబంధించిన అతి పెద్ద ప్రత్యక్ష పెట్టుబడి ఇది అని అంటున్నారు. త్వరలో క్లౌడ్ సేవల కింగ్ గా అమెజాన్ వెబ్ సర్వీస్ మారబోతూ దాని ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ ఏర్పాటు చేయడంతో అనేక వేలమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది..