డబ్బే డబ్బు : పారిశ్రామికవేత్త ప్రేమ్ జీ దాతృత్వం !
గత సంవత్సరం 5 కోట్లకంటే ఎక్కువ దానాలు ఇచ్చిన వ్యక్తుల జాబితా 109 ఉంటే అందులో 7 గురు మహిళలు ఉండటంతో పాటు వారి సగటు వయసు 66 సంవత్సరాలు ఉండటం గమనార్హం. ఈ వితరణ శీలులు ఎక్కువగా ముంబాయి నగరానికి చెందిన వారు కావడంతో ముంబాయ్ నగరం దాతృత్వంలో కూడ రాజధానిగా మరొక పేరు సంపాదించుకుంది.
ఈ దాతృత్వానికి సంబంధించి టాప్ 10 లిస్టులో అజిత్ ప్రేమ్ జీతో పాటు ముకేష్ అంబానీ హిందూజా సోదర్లు రాహుల్ బజాజ్ కుటుంబం శివనాడార్ కుటుంబం కుమార్ మంగళం బిర్లా కుటుంబాలు ఉన్నాయి. కరోనా వ్యాప్తి నేపద్యంలో అనేకమంది పారిశ్రామిక వేత్తలు ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కూడ ప్రేమ్ జీ 1,125 కోట్లు దానం చేసాడు.
అత్యంత సంపన్నుడైన ప్రేమ్ జీ వయసు 75 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆయన ఉదయం నుండి రాత్రి వరకు తన ట్రస్ట్ కార్యకలాపాలు చూస్తూనే ఉంటారు. అంతేకాదు ఈ వయసులో కూడ ముంబాయ్ లాంటి మహానగరంలో తానే స్వయంగా తన కారును డ్రైవ్ చేయడమే కాకుండా తన ఆఫీసు ల్యాప్ టాప్ ను తానే స్వయంగా మోసుకుంటూ చాల వడివడి గా అడుగులు వేయడం ఆయన అలవాటు. జీవితానికి రిటైర్మెంట్ అంటే మరణం మాత్రమే అంటూ జీవించి ఉన్నంతకాలం పనిచేస్తూ ఉండటమే జీవితం అని ప్రేమ్ జీ అంటూ ఉంటారు..