డబ్బే డబ్బు : 2022 నాటికి మల్టీమీడియాలో 13 లక్షలమందికి ఉద్యోగ అవకాశాలు !

Seetha Sailaja
ప్రస్తుతం చాలామంది చదువు అంటే ఇంజినీరింగ్ మెడిసెన్ మాత్రమే అనుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 13 లక్షలకు పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తుంటే వారిలో 2 లక్షల మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. దీనితో చదివే చదువులకు చేసే ఉద్యోగాలకు పొంతన ఉండకపోవడంతో దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగి పోతోంది.


ఈ పరిస్థితులలో ఒక ప్రముఖ మీడియా సంస్థ మన తెలుగు రాష్ట్రాలలోని యువత పనికి వచ్చే చదువులు చదువుతున్నారా లేదా అన్న విషయమై ఒక ఆసక్తికర సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. చదువులు అంటే కేవలం మెడిసెన్ ఇంజనీరింగ్ లు మాత్రమే కాదనీ ఏవ్యక్తి అయినా ఇంటర్ తరువాత విలువలేని డిగ్రీ కోర్సులు చదవకుండా పనికివచ్చే ఈ కోర్సులు చదివితే కనీసం జాబ్ కు మినిమం గ్యారెంటీ ఉంటుంది అంటూ ఆ సర్వే అభిప్రాయపడింది.


ముఖ్యంగా ఈ కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ హోటల్ మేనేజ్మెంట్ యానిమేషన్ మల్టీ మీడియా ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ లతో పాటు కృత్రిమ మేధలో మంచి కోర్సును ఎంచుకుని ఇంటర్ తరువాత ఈ కోర్సులలో ఏ కోర్స్ చేసినా వెంటనే ఉద్యోగం వచ్చేస్తుందని ఆ సర్వే అభిప్రాయం.


అదేవిధంగా మల్టీమీడియాలో డిగ్రీ చేసిన వారికి వెంటనే ఉద్యోగం దక్కుతోందని ఈ రంగంలో మరో రెండు సంవత్సరాలలో 13 లక్షలమందికి ఉద్యోగ అవకాశాలు దక్కపోతున్నాయి అంటూ ఆ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. అంతేకాదు రానున్న రోజులలో యువత ఎదో ఒక విషయంలో తమ స్కిల్స్ ను మేరుగు పరుచుకోలేకపోతే ఎంత పెద్ద చదువులు చదివినా ఉద్యోగ అవకాశాలు రావడం కష్టం అంటూ ఆమీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రస్తుతం పనికివచ్చే చదువులు ఏమిటో తెలిసి వచ్చేలా చేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: