డబ్బే డబ్బు : మార్కెట్ జోరులో ఈ జాగ్రత్తలు పాటిస్తే డబ్బే డబ్బు !
ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరిగిపోతున్నా భారత్ లో కూడ ఈ కొత్త కరోనా కేసులు పెరుగుతున్నా ఆ భయాలను పక్కకు పెట్టి స్టాక్ మార్కెట్ సూచీలు పరుగులు తీస్తూ ఉండటంతో త్వరలోనే సెన్సెక్స్ 50 వేల మార్క్ ను దాటుతుందని అంటున్నారు. కరోనా కు టీకాలు రావడంతో విదేశీ పెట్టుబడులు ప్రవాహం లా వచ్చి పడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితులలో స్టాక్ మార్కెట్ లోకి కొత్తగా ఎంటర్ అయినవారు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనీ ఎక్స్ పర్ట్ లు కొన్ని సూచనలు చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ జోరుమీద ఉన్న నేపధ్యంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నవారు తాము ఎంత నష్టం వరకు భరించగలం అన్న విషయమై ఒక స్థిరనిర్ణయం తీసుకుని మాత్రమే స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడం మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాదు షేర్లలో మదుపు చేసేడప్పుడు దీర్ఘకాలిక దృష్టి ఉండాలి. ఈరోజు ఒక లక్ష రూపాయలు పెట్టి మనకు నచ్చిన ‘ఏ గ్రేడ్’ కంపెనీ షేర్లు తీసుకుని కనీసం రెండు సంవత్సరాలు వేచి చూడగలిగితే ఖచ్చితంగా ఆ లక్ష రెట్టింపు అవుతుందని విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం షేర్ మార్కెట్ లో స్వల్ప కాలం లాభాలను ఆశిస్తూ ఎంటర్ అయ్యే ఇన్వేష్టర్లు ఒకవేళ ఊహించని విధంగా నష్టాలు వస్తే ఖంగారు పడకుండా ఆ షేర్లను అమ్మకుండా ఒక సంవత్సర కాలం ఉంచుకోగగితే మళ్ళీ లాభాల బాట పట్టవచ్చు.
షేర్ మార్కెట్ లో లాభాలు గణించాలి అంటే మన కొనుగోలు చేసే కంపెనీ షేర్ల గురించి పరిశోధన చేయడమే కాకుండా ప్రభుత్వ పాలశీలు మార్కెట్ పోకడలు ఆర్ధిక వ్యవస్థ పనితీరు ఇలా అన్ని విషయాల గురించి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే షేర్ మార్కెట్ లో జోరుగా అడుగులు వేయాలని విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు. దీనితో ప్రస్తుత మార్కెట్ జోర్ లో వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలని విశ్లేషకుల అభిప్రాయం..