డబ్బే డబ్బు : కొత్త స్టార్టప్ లతో అభివృద్ధి !

Seetha Sailaja
లాక్ డౌన్ పరిస్థితులు ఎదురైనప్పటికీ భారతదేశ అభివృద్ధి రేటు -7.7 శాతం ఖరార్ అయినప్పటికీ వచ్చే సంవత్సరం మన దేశ వృద్ధి రేటు 11 శాతం చేరుకొని రెండు అంకెల వృద్ధి ఖాయం అంటూ ఆర్ధిక శాఖామంత్రి ప్రవేశ పెట్టిన ఆర్ధిక సర్వే దేశ ప్రజలలో అనేక ఆశలను చిగురింప చేస్తోంది. ఇది ఇలా ఉంటే మనదేశ జనాభా 130 కోట్లు దాటిపోతే ఇప్పటికీ మన దేశంలో పన్ను చెల్లింపు దార్లు కేవలం 3.3 కోట్లు మాత్రమే ఉన్నారు అన్న వాస్తవం తెలిసినప్పుడు భారత్ లో పన్నుల పరిధిలోకి రాకుండా ఇప్పటికీ ఎంతోమంది తప్పించు కుంటున్నారు అన్న వాస్తవం మళ్ళీ ఒకసారి వెలుగులోకి వచ్చింది.


ఇలాంటి పరిస్థితులలో భారత ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందాలి అంటే అంకురాలు (స్టార్టప్స్) చోదక శక్తి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత దేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి 10 వేల కోట్ల నిధితో ‘ఫండ్ ఫర్ స్టార్టప్స్ ఏర్పాటు చేసే ఆలోచనలలో ప్రభుత్వం ఉంది.


ఈ కరోనా సమయంలో కూడ అనేకమంది వినూత్న ఆలోచనలతో ఏర్పాటు చేసిన స్టార్టప్స్ లో కొన్ని అనూహ్యమైన ప్రగతిని సాధించాయి. ఈశాన్య భారత దేశంలో అడవులలో వెదురు చెట్లు పుష్కలంగా ఉంటాయి. వాటి నుంచి తీసే ద్రవంతో సువాసనలు వెదజల్లే ఫ్రెష్నర్ తయారు తయారుచేయవచ్చని ఒక యువకుడుకు వచ్చిన ఆలోచన ఇప్పుడు భారత్ లో ఒక ప్రముఖ స్టార్టప్ గా మారింది.


అదేవిధంగా తమిళనాడుకు చెందిన ఒక యువకుడు అడవి గింజలు తో ఆభరణాలు తమారుచేసి విదేశాలకు ఎగుమతులు చేసే స్థాయిలో ఒక స్టార్టప్ ను నిర్వహిస్తున్నాడు. అంతేకాదు మత్స పరిశ్రమా వ్యవసాయం పోషక ఆహారం వైద్యం పాడి పరిశ్రమ రంగాలతో పాటు నల్లబియ్యంతో నూడిల్స్ తయారుచేసిన ఒక యువకుడి స్టార్టప్ మన యువత తెలివి తేటలకు నిదర్శనం. నిజంగానే 10 వేలకోట్ల స్టార్టప్ ఫండ్ అమలులోకి వస్తే ఎన్నో కొత్త పరిశ్రమలు రాగాడమే కాకుండా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే ఆస్కారం ఉంది..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: