డబ్బే డబ్బు : స్మార్ట్ ఫోన్ ల వినియోగం పై నోకియా షాకింగ్ సర్వే !
అదేవిధంగా మన దేశంలో డేటా వినియోగం 60 రెట్లు పెరిగి ప్రపంచంలోని డేటా సగటు వినియోగం కంటె ఎక్కువగా ఉందని ఈ నివేదిక తెలియచేసింది. మన దేశంలో సగటున స్మార్ట్ ఫోన్ వినియోగించే వ్యక్తి 13.7 జీబీని వాడుతున్నాడని ఈ నివేదిక ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం మనదేశంలోని స్మార్ట్ ఫోన్ వినియోగ దారుడు రోజుకు 4.48 గంటల డేటా సేవలను వినియోగించుకుంటున్న విషయాన్ని కూడ తెలియచేసింది.
అయితే ఈ డేటా వినియోగంలో 55 శాతం యూట్యూబ్ సోషల్ మీడియా ఇతర ఓటీటీ యాప్ ల లోని షార్ట్ వీడియోలను చూడటానికి వినియోగిస్తూ ఉంటే ఎడ్యుకేషన్ యాప్ లపై మాత్రం కేవలం 45 శాతం మాత్రమే డేటా వినియోగం ఉంది అన్న విషయాన్ని తెలియ చేసింది. అంతేకాదు ఎడ్యుకేషన్ యాప్ లపై గడిపే సమయం 30 శాతం వృద్ధి చెందితే ఓటీటీ ట్రాఫిక్ మాత్రం 265 శాతం పెరిగిన విషయాన్ని ఈ నివేదిక వెల్లడించింది.
అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల స్మార్ట్ ఫోన్ ను వదిలి ఉండలేని పరిస్థితులో కొంతమంది ఈ ఫోన్ కు అతుక్కుపోతున్నారని ఈ విషయంలో కూడ భారత్ లోని యువత ఇతర ప్రపంచ దేశాల యువత కంటే ముందు వరసలో ఉన్నట్లు ఈ నివేదిక తెలియ చేసింది. ఇప్పటికే పెరిగిన ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల మానసిక సమస్యలు వస్తున్నాయి అన్న అంచనాలు వస్తున్న పరిస్థితులలో పెరిగిపోతున్న ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం ఏ పరిస్థితులకు దారితీస్తుందో అని మానసికం శాస్త్ర వేత్తలు ఆందోళన చెందుతున్నారు..