బ్యాంకు ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌...ఎప్రిల్ లో 12 రోజులు సెలవులు..!

MADDIBOINA AJAY KUMAR
మీకు బ్యాంక్ ఖాతా ఉందా..? మీ ఖాతాలో డ‌బ్బులున్నాయా.? ఏవైనా ముఖ్య‌మైన లావాదేవీలు జ‌ర‌పాలా అయితే ఈ విష‌యాన్ని మీరు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎప్రిల్ నెల‌లో ప‌న్నెండు రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు వ‌స్తున్నాయి. కాబ‌ట్టి బ్యాంక్‌లో ప‌ని ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎప్రిల్ ఏకంగా మ‌ధ్య మ‌ధ్య‌లో గ్యాప్ తో 12 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు రానున్నాయి. ఎప్రిల్ నెల‌లో ముప్పై రోజులుండ‌గా 12 రోజులు సెల‌వు కావ‌డంతో బ్యాంకు ప‌నిచేసేది ఇంకా 18 రోజులే. కాబ‌ట్టి ముఖ్య‌మైన బ్యాంకు ప‌నులుంటే ముందుగానే ప్లాన్ చేసుకోవ‌డం మంచింది. మ‌రోవైపు మార్చి నెల‌లో 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య బ్యాంకులకు 7 రోజులు సెలవులు వ‌స్తున్నాయి. కాబ‌ట్టి లావాదేవీలుంటే ముందుగానే ప్లాన్ చేసుకోవ‌డం ఉత్త‌మం. రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండ‌ర్ ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలంగాణ‌లో ఎప్రిల్ లో 12 రోజులు బ్యాంకులు మూత ప‌డ‌తాయి.

ఈ 12 రోజుల్లో ఆరు రోజులు సాధార‌ణ సెల‌వులు, ఆరు రోజులు గుడ్ ఫ్రైడే ఇత‌ర ప్ర‌త్యేక రోజులున్నాయి. ఏప్రిల్ 1న కూడా బ్యాంక్ సేవలు సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉండవు బ్యాంకులు వార్షిక ఖాతాల క్లోజింగ్ పనిలో ఉంటాయి కాబ‌ట్టి ఆరోజు సెల‌వు, ఏప్రిల్ 2న‌ గుడ్ ఫ్రైడే కాబ‌ట్టి ఆ రోజు కూడా సెల‌వే. అదే విధంగా ఏప్రిల్ 4 ఆదివారం వ‌స్తుంది కాబ‌ట్టి సెల‌వు, ఏప్రిల్ 5న‌ బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు సంధ‌ర్బంగా ఆరోజు కూడా సెల‌వు దినం, ఏప్రిల్ 10న‌ రెండవ శనివారం వ‌స్తుంది కాబ‌ట్టి ఆరోజు కూడా సెల‌వు, ఏప్రిల్ 11న‌ ఆదివారం దాంతో ఆరోజు కూడా సెల‌వు దినం , ఇక ఏప్రిల్ 13న‌ ఉగాది పండుగ సంధ‌ర్భంగా సెల‌వు , ఏప్రిల్ 14 డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కాబ‌ట్టి ఆరోజు కూడా సెల‌వు దిన‌మే, మ‌రోవైపు ఏప్రిల్ 18 ఆదివారం, ఏప్రిల్ 21 శ్రీరామ నవమి, ఏప్రిల్ 24 నాల్గవ శనివారం, ఏప్రిల్ 25 ఆదివారం సెల‌వులు వ‌స్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: