మనీ : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరింత లాభం పొందే అవకాశం.. ఏంటో చూద్దామా..
ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను తెలిపింది.. అది ఏమిటంటే ప్రావిడెంట్ ఫండ్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ప్రకటన చేసింది.. కానీ అంతకుముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జూన్ 2021 వరకు కరువు భత్యం అంటే డీ ఏ ఎప్పటికప్పుడు టైం ప్రకారం పొందుతున్నారు. ఇక అయినప్పటికీ వారికి శాలరీ లో మాత్రం మార్పు కనిపించడం లేదు. కానీ ఇకపై శాలరీ లో మార్పు జూన్ 2021 నుంచి మాత్రమే కనిపిస్తుంది. వివరంగా చెప్పాలి అంటే జనవరి నుంచి జూన్ 2021 వరకు మూడు రకాల డీఏ లను ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి పొందవచ్చు. వాటిని సీ జీ ఎస్ సాలరీ కి కలుపుతారు. ఇక ఫలితంగా నెలవారి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. అంటే దీర్ఘకాలం లోని పీఎఫ్ బ్యాలెన్స్ పెరుగుతుంది..
ఆలిండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం జనవరి నుంచి జూన్ 2021 వరకు కేంద్రం డీ ఏ ను 4% పెంచనుంది. అలాగే జనవరి నుంచి జూన్ 2020వరకు మూడు శాతం, జూలై నుంచి డిసెంబర్ 2020 వరకు మూడు శాతం అని భావించవచ్చు. అంటే మొత్తం 11 శాతం డీ ఏ లభిస్తుంది. ఇక డీ ఏ ను కనుక చెప్పినట్లు ఇస్తే..ఇది ఇప్పుడున్న 17 శాతం నుంచి 28 శాతానికి పెరుగుతుంది..
ఇప్పుడు ఈ డీ ఏ 17 శాతం నుంచి 28 శాతానికి పెంచినట్లు అయితే, పీ ఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెంచి నట్లే.. అందువల్ల ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారి జీతంలో కూడా మార్పులను తీసుకొస్తుంది.. ప్రస్తుతం 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 58 లక్షల మంది రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వీరందరూ కూడా డీ ఏ ను పొందవచ్చు... ఈ క్రమంలో జూలై నుంచి రూల్స్ మరే ఛాన్స్ కూడా ఉంది. ఏదిఏమైనా ఇకపై శాలరీ లో కూడా మార్పులు ఉండనున్నాయి.