మనీ : ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పొందవచ్చు..?
సాధారణంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్ ప్లాన్ ల గురించి ఆలోచించి, ముందు జాగ్రత్త కోసం కొన్ని రంగాలలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు.. అయితే మరికొంతమంది రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఎటువంటి కష్టం లేకుండా ఆదాయం పొందాలని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు.. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత కష్టపడకుండా ఉండాలనుకుంటున్నారు.. ప్రతినెల ఆదాయం పొందాలని భావిస్తున్నారు.. అయితే అలాంటి వారి కోసమే ఒక చక్కటి అవకాశం అందుబాటులో ఉంది. అయితే మీ రిటైర్మెంట్ డబ్బును ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. తద్వారా మీరు ప్రతినెలా ఆదాయం పొందొచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఉదాహరణకు మీకు ఒక కోటి రూపాయలు రిటైర్మెంట్ ఫండ్ వచ్చింది అని అనుకుందాం.. మీరు ఈ డబ్బుతో ప్రతినెల యాభై వేల రూపాయలు సంపాదించాలని చూస్తున్నారు. అయితే అందుకోసం ఏం చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం..
ఇప్పుడు మీరు రూ. 15 లక్షలను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లో పెట్టాలి. అలాగే మరో రూ.15 లక్షలను ప్రధానమంత్రి వయ వందన యోజన స్కీమ్ లో ఇమేజ్ చేయాలి.. ఇంకా మిగిలిన రూ.60 లక్షలను సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టాలి.. అయితే ఇలా ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఒక విషయాన్ని గమనించాలి..సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లలో డబ్బులు పెడితే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ లలో కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది.
అయితే మీరు ఇన్వెస్ట్ చేసే సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల ఇష్యూయర్ కంపెనీని, నిశితంగా గమనించాల్సి ఉంటుంది.. లాకిన్ పీరియడ్, విశ్వసనీయత వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.. ఇక వీటి ద్వారా మీరు నెలకు రూ. 50 వేల రూపాయలను పొందవచ్చు. అయితే ఈ విధంగా అర్జీంచే వడ్డీ ఆదాయంపై పన్ను కూడా పడుతుందన్న విషయం గమనించాలి..