మనీ : బైక్ ప్రియులకు శుభవార్త.. ఒక బైక్ .కొంటే 50 వేల రూపాయల వరకు తగ్గింపు..
మార్కెట్లోకి ప్రతిరోజు కొత్త బైకులు అందుబాటులోకి వస్తున్నాయి. కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని, వారి అభిరుచులకు తగ్గట్టుగా బైక్ లను ఉత్పత్తి చేస్తున్నాయి పలు కంపెనీలు.. అంతేకాకుండా కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రకాల మోడళ్లను, తయారు చేయడమే కాకుండా భారీగా ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి.. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక వార్త మాత్రం బైక్ ప్రియులకు శుభవార్త అని చెప్పవచ్చు.. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్త బైక్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఒక ద్విచక్ర వాహన కంపెనీ, వినియోగదారులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.. అది ఏదో కాదు దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ" కవాసకి ఇండియా " తన మోడళ్ల పై అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఇక ఈ కంపెనీ ట్విట్టర్ వేదికగా ఈ ఆఫర్ వివరాలను ప్రకటించింది.. ఇది ముఖ్యంగా ఎవరికి ప్రయోజనకరం అంటే, సాధారణ బైక్ నుంచి స్పోర్ట్స్ బైక్ కు షిఫ్ట్ అవ్వాలని భావించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.. ఇక ఇందులో మీరు నచ్చిన బైక్ కొనుగోలు చేయాలని భావిస్తే, దగ్గర్లోని కవాసకి షోరూమ్ కి వెళ్లి ఆఫర్ తెలుసుకోవచ్చు.
అయితే ఈ బైక్ లపై తగ్గింపు ఆఫర్లు కూడా ఏప్రిల్ 30 వ తేదీ వరకు గడువు విధించింది. వల్కన్ ఎస్ మోడల్ పై రూ.20 వేలు, వెర్సీస్ 650 బైక్ పై రూ. 30 వేలు, నింజా 1000 ఎస్ ఎక్స్ బైక్ పై రూ. 30 వేలు, డబ్ల్యూ 800 మోడల్ పై రూ. 30 వేలు రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇక వీటితో మాత్రమే కాకుండా ఇతర కొత్త బైక్‌ల పై కూడా ఆఫర్లు ఉన్నాయి. అంటే అప్లోడ్ వర్షన్ అయిన బైక్ ల పై కూడా డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది... అంటే కే ఎల్ ఎక్స్ 110 మోడల్‌పై రూ. 30 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే కే ఎల్ ఎక్స్ 140 మోడల్ పైరూ. 40 వేల వరకు డిస్కౌంట్ అలాగే కే ఎక్స్ 100 మోడల్ పై రూ. 50 వేల వరకు తగ్గింపు ఉంది.. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆ కంపెనీ ప్రకటించింది..