మనీ : కేవలం రూ.1000 తో ఏకంగా రూ.26 లక్షలు మీ సొంతం..
తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో డబ్బును పొందాలని ఎవరికి మాత్రం ఉండదు. ఇది ప్రతి ఒక్కరూ కనే కలే కదా..! తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందాలని, ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. ఇక అందుకు తగ్గట్టుగానే పోస్ట్ ఆఫీస్ లు , బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం సైతం తమ కస్టమర్ల కోసం వివిధ రకాల స్కీమ్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో స్కీమ్ లలో, ఇప్పుడు చెప్పబోయే స్కీమ్ కూడా ఒకటి. అయితే ఆ స్కీమ్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ స్కీమ్ ఏదో కాదు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకం కూడా ఒకటి.. దీనికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే, స్మాల్ సేవింగ్స్ స్కీమ్ అయినప్పటికీ ఇందులో ప్రతి నెలా,కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ పోతే, మెచ్యూరిటీ సమయంలో మంచి ప్రాఫిట్ ను పొందవచ్చు. ఇప్పుడు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై 7.1 శాతం వడ్డీ కూడా లభిస్తోంది. మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుంది.
ఇక లేదంటే గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డబ్బులను పెట్టవచ్చు. ఇలా మీకు నచ్చినట్టు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. ఇందులో కనుక మీరు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో 26 లక్షల రూపాయల వరకు పొందవచ్చు..
ఇక మీరు కావాలి అంటే మరొక ఐదు సంవత్సరాల పాటు మెచ్యూరిటీ సమయాన్ని పెంచుకోవచ్చు. నెలకు వెయ్యి రూపాయలు పెడితే, 15 సంవత్సరాలలో రూ.3.2 లక్షలు వస్తాయి. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కింద మెచ్యూరిటీ కాలాన్ని అయిదుసార్లు ఎక్స్టెండ్ చేస్తూ పోతే, మొత్తం 40సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే, మీ చేతికి రూ.26లక్షలకు పైగా వస్తాయి.