డబ్బు అవసరమా..? అయితే ఈజీగా ఇలా లోన్ తీసుకోండి..

Purushottham Vinay
డబ్బు అనేది నిత్యావసరం. ప్రతి ఒక్కరికి చాలా  చాలా అవసరం. ఈరోజుల్లో డబ్బు లేకుంటే బతకడం చాలా కష్టం. పైగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో పేద మధ్య తరగతి ప్రజలకు చాలా అవసరం. అయితే చాలా మంది చాలీ చాలని జీతాలతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. నెలాఖరు వచ్చేసరికి ఏమి మిగలవు. పోనీ బ్యాంకు లో లోను తీసుకోవాలంటే అది పెద్ద తలనొప్పి. పైగా ఈ కరోనా టైం లో అంత రిస్క్ తీసుకోలేము. ఇక డబ్బు అవసరం. లోన్ తీసుకోవడం ఎలా? అని అనుకునేవారికి ఇది చాలా సులభమైన పధ్ధతి. అదెలాగో తెలుసుకోండి...పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ఇది చాలా సులభమైన పధ్ధతి. ఎటువంటి రిస్క్ ఉండదు. చక్కగా ఇంట్లో కూర్చొని తీసుకోవచ్చు.ఎలాంటి ఒత్తిడి ఉండదు.సులువుగా ప్రాసెస్ కూడా అయిపోతుంది. అప్లికేషన్ మీద అప్రూవల్ కూడా వెంటనే వచ్చేస్తుంది. దీని కోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా. వెంటనే మీరు డబ్బులు కూడా పొందొచ్చు. అయితే పర్సనల్ లోన్ తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఉండాలి. లెండర్ వెబ్ సైట్‌లో ఉండే డాక్యుమెంట్స్‌ని మీరు తప్పకుండా సబ్మిట్ చేయాలి.


ఇలా చేయడం వల్ల మీకు చాలా తక్కువ టైంలోనే ఈజీగా లోన్ వస్తుంది. అప్లికేషన్ ప్రొసీజర్ మీద కూడా ఎక్కువ సమయం తీసుకోరు. మామూలుగా మనం కనుక లోన్ తీసుకోవాలంటే నిజంగా పేపర్లు పట్టుకుని తిరుగుతూ ఉండాలి. దీని వల్ల సమయం అయిపోతూ ఉంటుంది.అయితే కొన్ని లోన్ లు ఇచ్చే కంపెనీస్‌లో మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే ఎక్కువ పేపర్ వర్క్ కూడా ఉండదు అని వాళ్ళు చెబుతున్నారు. కేవలం మీరు ఐడి ప్రూఫ్, పాన్ కార్డుని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దీని కారణంగా సబ్‌మిషన్ చాలా స్పీడ్‌గా అయిపోతుంది ఇంకా పని కూడా వేగంగా అయిపోతుంది.వెరిఫికేషన్ కూడా క్షణాల్లో అయిపోతుంది. అదే విధంగా సెక్యూరిటీ కోసం మీరు ఎటువంటి డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయక్కర్లేదు. అదే విధంగా అప్రూవల్ టైమ్‌ కూడా తగ్గుతుంది.


ఇక బ్యాంకు నుండి డబ్బులు ఎంతో వేగంగా మీరు పొందొచ్చు. ఇక్కడ ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది. కొన్ని పర్సనల్ లోన్స్ కేవలం 24 గంటల్లో అప్రూవల్ అయిపోతాయి. ఐదు నిమిషాలు మాత్రమే పడుతుంది. మీరు కనుక ఎలిజిబుల్ అయితే వెంటనే మీకు డబ్బులు కూడా వచ్చేస్తాయి. 25 లక్షల రూపాయల వరకు కూడా మీరు పర్సనల్ లోన్ కింద పొందొచ్చు. సాలరీ వచ్చే ఎంప్లాయిస్‌కి తప్పకుండా ఇంత డబ్బు వస్తుంది. పర్సనల్ లోన్ మీకు అత్యవసర సమయంలో తీసుకోవచ్చు. ఇటువంటి సమయంలో నిజంగా వేగంగా డబ్బులు చేతికి వస్తే మనకి ఎలాంటి ఇబ్బందులు వుండవు.ఇలా పర్సనల్ లోన్ ఇచ్చే యాప్స్ చాలా ఉంటాయి. వాటిని ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకొని తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ ఆధారంగా మీకు లోన్ మంజూరు అవుతుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే మీరు ఇంకా ఎక్కువ లోన్ పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: