మనీ: ప్రతి నెల రూ. 2000 ఇన్వెస్ట్ చేస్తే చాలు, అరకోటి మీ సొంతం..
నాటి నుంచి నేటి వరకు ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలి. ఆ డబ్బును భావితరాల వారికి దాచి పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒక మంచి పెట్టుబడి సంతృప్తికరమైన రాబడిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇందుకోసం వీలైనంత త్వరగా పెట్టుబడులను ప్రారంభించడం ఎంత ముఖ్యమో, అంతే క్రమశిక్షణతో నడుచుకోవడం కూడా ముఖ్యం. సరిగ్గా ఇలాంటిదే ప్రజా భవిష్య నిధి (పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్) కూడా. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడులకు ఖచ్చితమైన రాబడి ఉంటుంది. అందవల్ల సరైన కాలపరిమితిని ఎంచుకుంటే పీపీఎఫ్ పెట్టుబడుల వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందవచ్చు.. పైగా ఎలాంటి రిస్క్ ఉండదు.
అయితే ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేస్తే , అతి తక్కువ కాలంలో ఎక్కువ రాబడి మనకు వస్తుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. సాధారణంగా ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందుకోసం ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ పోతే, 50లక్షలకు పైగా రాబడిని పొందవచ్చు.
ప్రస్తుతం ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో వడ్డీ రేటు 7.1 శాతం లభిస్తోంది కాబట్టి, సంవత్సరానికి కనీసం రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పీపీఎఫ్ ఖాతాలో జమచేయవచ్చు. అయితే 15 సంవత్సరాల మెచ్యూరిటీ కాలం ఉంటుంది. మెచ్యూరిటీ కాలం ముగిసిన తరువాత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా మరో 5 సంవత్సరాల కాలవ్యవధి చొప్పున, ఎన్ని సంవత్సరాలైనా ఖాతాను కొనసాగించవచ్చు. మీరు ప్రతి సారి ఐదు సంవత్సరాలు కాలపరిమితిని పెంచడం వల్ల మీ డబ్బు కూడా పెరుగుతుంది..
అయితే ఇందుకు నెలకు రూ.2000 చొప్పున 15 సంవత్సరాల మెచ్యూరిటీ కాలం వరకు పెట్టుబడి పెడితే, వచ్చే మొత్తం రూ.6,50,916. ఇందులో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.3,60,000 ఇక వడ్డీ రూ.2,90,916. మొత్తం కలిపితే రూ.6,50,916.
ఇలా ప్రతిసారి ఐదు సంవత్సరాలు పెంచుకుంటూపోతే, ఐదవసారి ఐదేళ్ల కాలవ్యవధిని పెంచుకోవడం వల్ల 40 సంవత్సరాలకు రూ.52,65,554 వస్తుంది. అంటే మీరు మీ వయసు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ స్కీం లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే , 60 సంవత్సరాలు వచ్చే సరికి ఇంత మొత్తాన్ని తీసుకోవచ్చు.