మనీ : ఈ స్కీం లో చేరడం వల్ల రూ. లక్షల్లో ప్రయోజనం..

Divya

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ఎన్నో స్కీమ్ లు  కేవలం  మంచి రాబడి కోసం మాత్రమే కాదు నిరుపేదలకు అవసరమైన ఆరోగ్య సేవలను అందించడానికి కూడా, సరికొత్త స్కీమ్ లను  అందుబాటులోకి తీసుకువస్తూ ఉంటాయి. ముఖ్యంగా పేద ప్రజలే ధ్యేయంగా, వారికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ, అందరితో సమానంగా జీవించాలనే హక్కును కూడా తీసుకొచ్చింది భారత రాజ్యాంగం. ఇక రాజ్యాంగాన్ని గౌరవిస్తూ,  కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే చాలా కాలం నుంచి నిరుపేదలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో,  వారికి సరైన ట్రీట్మెంట్ అందక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా వారికి వచ్చిన జబ్బులను నయం చేసుకోవాలి అంటే లక్షల్లో కూడుకున్న పని కావడంవల్ల , ఆ డబ్బులు పెట్టలేక, చివరకు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ స్కీం వల్ల పేద ప్రజలకు ఎలాంటి లాభం చేకూరుతుంది ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో రకాల స్కీం లలో ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకం లో చేరడం వల్ల ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. ముఖ్యంగా మోదీ సర్కార్ పేదల కోసం మాత్రమే ఈ పథకాన్ని తీసుకొచ్చింది. మన దేశంలో చాలా మంది నిరుపేదలు సరైన వైద్య సేవలు అందక, అర్థంతరంగా జీవితాన్ని చాలిస్తున్నారు. అలాంటి ఎంతోమంది నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ  ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్ లో చేరడం వల్ల ప్రతి ఒక్క నిరుపేద కూడా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు.


ఆయుష్మాన్ భారత్ యోజన పథకం కింద ఒక్కో కుటుంబం రూ.5 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతే కాకుండా పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో సంవత్సరానికి రూ.ఐదు లక్షల వరకు ట్రీట్మెంట్ ఉచితంగా చేయించుకోవచ్చు . మీరు కూడా ఈ ఫెసిలిటీ పొందాలనుకుంటే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. ఉచితంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. ఇందుకోసం  మీరు చేయవలసిందల్లా, మీకు దగ్గర్లో వున్న ప్రభుత్వ హాస్పిటల్స్ కి వెళ్లి సీఎంవో ను కలిస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు తెలియకపోతే ఆరోగ్యమిత్ర ద్వారా కూడా మీరు ఆయుష్మాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: