మనీ : కరోనాతో మృతి చెందారా..? ప్రతినెలా రూ. 1800..

Divya

కరోనా.. కరోనా.. ఈ వైరస్ ఎప్పటికప్పుడు సరికొత్తగా రూపాంతరం చెందుతూ,  ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ వైరస్ ఎప్పుడు ఎలా రూపాంతరం చెందుతుందో, ఎప్పుడు ఎవరికి ఎలా సోకుతుందో కూడా తెలియక పరిశోధకులు కూడా తలపట్టుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంతో మంది వైద్యులు, విజ్ఞానులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దీనిని అంతం చేయలేకపోతున్నారు. కానీ సర్వ ప్రయత్నాలు చేసి, ఈ వైరస్ ను పూర్తిగా అంతం చేయలేకపోయినప్పటికీ, దీని వ్యాప్తిని నియంత్రించడానికి వ్యాక్సిన్లను కనుగొన్న విషయం తెలిసిందే.
అయితే కొంతమంది ఇదివరకే ఈ వైరస్ బారిన పడి చనిపోయిన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు అనాధలవ్వడం, పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు సంతానలేమిని పొందడం వంటివి చూస్తూనే ఉన్నాం. ఇక ఇంటి పెద్ద మరణించినప్పుడు , ఆ కుటుంబానికి అండ లేక ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది ఆ కుటుంబం. అయితే ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేమిటంటే , ఎవరైతే కరోనా బారిన పడి మరణిస్తున్నారో , ఆ కుటుంబానికి ఆ వ్యక్తి తరఫున 1800 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందుకోసం మీరు చేయవలసింది ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ఇదివరకే  ఈ ఎస్ ఐ సి స్కీం ద్వారా ప్రయోజనం పొందుతున్న అభ్యర్థులు ఇందుకు అర్హులు. ఇక ఈ స్కీం లో చేరిన వారు ఎవరైనా సరే కరోనా బారిన పడి చనిపోతే, ఇక అతని పై ఆధారపడిన భార్య లేదా తల్లిదండ్రులు లేదా పిల్లలకు ప్రతి నెల 1800 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇటీవల కొవిడ్-19 రిలీఫ్ పథకం కింద దీనిని చేర్చడం  కూడా జరిగింది. ఎవరైతే ఈ ఎస్ ఐ సి కార్డ్ హోల్డర్ కరోనాతో మరణిస్తారో, ఈ డబ్బులు వారి కుటుంబానికి అందించడం జరుగుతుంది. ఇక ఇలా చేయడం వల్ల ఆ కుటుంబానికి కొంత రిలీఫ్ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: