మనీ: ఎల్ఐసి పాలసీ దారులకు ముఖ్య గమనిక.. వెంటనే ఇలా చేయండి.!
ఎల్ఐసి సంస్థ తమ పాలసీదారులకు ఒక ముఖ్యమైన అలర్ట్ ను పంపిస్తోంది. ఇప్పటివరకు ఎవరైతే పాలసీ తీసుకుని.. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్లు వెంటనే ఎల్ఐసి పాలసీ కి పాన్ కార్డును జత చేయాలని సూచిస్తోంది. లేకపోతే పాలసీ యొక్క నిర్ణీత కాల వ్యవధి ముగిసిన తర్వాత.. రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బులు విత్ డ్రా చేసే సమయంలో తప్పకుండా పన్ను విధించబడుతుంది. అందుకే ఎల్ఐసి పాలసీ దారులు వెంటనే బ్యాంకు దగ్గరికి వెళ్లి మీ ఎల్ఐసి ఖాతాకు సంబంధించిన పాలసీకి వెంటనే పాన్ కార్డును అనుసంధానం చేయండి.
ఒకవేళ ఆఫ్లైన్లో అనుసంధానం చేయలేక , తమ పనులతో బిజీగా ఉన్న వారు ఆన్లైన్ ద్వారా కూడా మీ పాలసీకి పాన్ కార్డు నెంబర్ లింక్ చేయవచ్చు. ఎల్ఐసి వెబ్సైట్లోకి వెళ్లి మీ పాలసీ నంబర్ కు పాన్ కార్డు నెంబర్ ను అనుసంధానం చేసుకునే వెసులుబాటును కూడా ఎల్ఐసి కల్పిస్తోంది. కేవలం మూడు సులభమైన స్టెప్ ల లోనే ఈ పని పూర్తవుతుంది. ఎల్ ఐ సి వెబ్ సైట్ లోకి వెళ్ళిన తర్వాత పాన్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.. దానిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే.. ఎల్ ఐ సి పాలసీ నెంబరు కు పాన్ కార్డు నంబర్ అనుసంధానం చేసినట్లే.