మనీ: రూ.లక్ష కు రూ.8 లక్షలు ..కేవలం 6 నెలల్లోనే..!!

Divya
సాధారణంగా జీవితంలో ఎవరైనా సరే తక్కువ మొత్తంలో అధిక రాబడి పొందాలి అని ఆలోచిస్తూ ఉంటారు.. అందుకోసం కొంతమంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల లో డబ్బులు దాచుకుంటూ ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉంటారు. మరికొంత మంది వడ్డీ వ్యాపారం చేయడం వల్ల కూడా అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఈ వడ్డీ వ్యాపారం చేయడం వల్ల సమయానికి వడ్డీ వస్తుందో లేదో డబ్బు ఇచ్చిన వారు సకాలంలో చెల్లిస్తారు లేదో అనే భయం కూడా ఉంటుంది. కానీ మనం ఒకవేళ లక్ష రూపాయలు కనుక ఎవరికైనా వడ్డీ డబ్బులు ఇచ్చినట్లయితే , ఆ వడ్డీ కేవలం 25 వేలకు మించి మనకు రాదు అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ రూ.లక్షకు.. ఎనిమిది లక్షల రూపాయలు వస్తుందని చెబుతున్నారు అది కూడా కేవలం ఆరు నెలలకే..అదేంటో ఒకసారి చదివి తెలుసుకుందాం..

తక్కువ మొత్తంలో ఎక్కువ రాబడి వచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయా అంటే అది కేవలం స్టాక్ మార్కెట్ అని చెప్పవచ్చు. ఈ స్టాక్ మార్కెట్ లో డబ్బు లు పెట్టడం వల్ల కొంచెం రిస్క్ అయినప్పటికీ తక్కువ మొత్తంలో ఎక్కువ లాభాలను పొందే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటికే పలు స్టాక్ మార్కెట్లు మాత్రం ఇన్వెస్టర్లకు మంచి లాభాలను ఆర్జించి పెట్టాయి.. స్టాక్ మార్కెట్లలో ఒకటి రత్తన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ షేర్ కూడా ఒకటి. ఈ షేర్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది ఇన్వెస్టర్లు మంచి లాభాలను కూడా పొందారు. 2021- 2022 ఆర్థిక సంవత్సరానికి గాను షేర్ యొక్క ధర చూసుకున్నట్లయితే 700 శాతానికి పైగా పరుగులు పెడుతోంది.
ఉదాహరణకు 2021 మార్చి 31వ తేదీన ఒక్కొక్క షేర్ ద్వారా ఐదు రూపాయల వద్ద అనుకుంటే ప్రస్తుతం దాని ధర నలభై రెండు రూపాయలకు పైకి పాకింది.. అంటే మీరు గనక ఒక లక్ష రూపాయలు పెట్టి ఉంటే ఇప్పుడు దాని విలువ రూ.8.39 లక్షలు అన్నమాట. అంతేకాదు ఈ షేరు విలువ జూలై నాటికి 70 రూపాయల వరకు చేరడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: