మనీ: ఈ దీపావళి వేళ మహిళలకు శుభవార్త తెలిపిన కేంద్రం..!!

Divya
దీపావళి పండుగకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళల కోసం ఒక శుభవార్త ను తీసుకు వచ్చింది.. శుభవార్త అనే విషయాన్ని పక్కనపెడితే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ , వంట నూనె కూడా ధరలు పెరిగి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.. ముఖ్యంగా మన దేశంలో వాహన ఇంధన ధరలు గరిష్టంగా పెరిగిపోతూ ఉండడంతో సామాన్యుడికి ఇబ్బందిగా మారింది. తాజాగా మనం వండడానికి ఉపయోగించే నూనెలో కూడా ధరలు పెరగడంతో ఇక ఏం తినాలో కూడా తెలియక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.. ఇకపోతే చమురు ధరలను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. అందుకే దీపావళికి ముందు కొంచెం ప్రజలకు ఊరట కలిగించడానికి వంట నూనెను తగ్గించింది.
భారతదేశంలో తినగలిగే వంట నూనెల విషయానికొస్తే.. రాబోయే కాలంలో ధరల తగ్గే అవకాశాలు కూడా కనిపించబోతున్నట్లు వినియోగదారులకు మంచి ఉపశమనం కూడా కలుగుతుంది అని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే ఈ పండుగ సీజన్లో  ఎడిబుల్ నూనె కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. హోల్ సేల్ ధరలలో  కిలోకు 3 రూపాయాల నుంచి 5 రూపాయల వరకు తగ్గించనున్నట్లు సమాచారం.

అందుకే ఈ దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని టన్నుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ తగ్గించాలని సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యుల నిర్ణయం తీసుకున్నారు. ఇక వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ డేటా ప్రకారం చూసుకుంటే ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా.. పామాయిల్ నూనె రిటైల్ ధర అక్టోబర్ 31వ నాటికి కిలో పై 21.5 శాతం తగ్గి రూ.132.98 చేరుకుంది. సోయా నూనె రూ. 153 రూపాయలకు తగ్గింది. వేరుశెనగ నూనె రూ.181.97 , ఆవాల నూనె రూ.184.99, సన్ ఫ్లవర్ ఆయిల్ ధర రూ.168 కు తగ్గించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: