మనీ: ఆ కార్డు ముట్టుకుంటే ఇక బాదుడే అంటున్న ఎస్బిఐ..!!
అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే నెల డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నట్లు బ్యాంకు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే ఎవరైతే ఎస్బిఐ బ్యాంకు ద్వారా క్రెడిట్ కార్డు తీసుకొని వినియోగిస్తున్నారో అలాంటి వారికి ఈ మెయిల్ ద్వారా కూడా ఈ విషయాన్ని పంపినట్లు అధికారులు వెల్లడించారు... అయితే డిసెంబర్ 1కి ముందుగా ఎవరైనా ఈఎంఐ పద్ధతి ద్వారా క్రెడిట్ కార్డును ఉపయోగించి వస్తువులను కొనుగోలు చేసి ఉండి ఉంటే, ఫీజు మినహాయింపు ఉంటుంది. కానీ ఆ తేదీ తర్వాత ఈఎంఐ బుకింగ్ జరిగితే ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉండదు.
కానీ డిసెంబర్ 1 తరువాత క్రెడిట్ కార్డ్ ఉపయోగించి వస్తువులు కొనుగోలు చేస్తే ప్రాసెసింగ్ ఫీజు తో పాటు పన్ను కూడా కట్టాల్సి ఉంటుంది అని ఎస్బిఐ స్పష్టం చేసింది. ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ లు ఏం చేయాలో తెలియక , తమకు నచ్చిన వస్తువులను ఇప్పుడే కొనుగోలు చేసుకోవాలని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.