మనీ : రూ.110 చెల్లిస్తే చాలు.. రూ.6 లక్షల బెనిఫిట్స్..!!

Divya
కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి, అట్టడుగు వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం వారి భవిష్యత్తు రీత్యా కొన్ని రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్నారు. అయితే ఇప్పుడు సరికొత్త పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది .అయితే ఇది ఇన్సూరెన్స్ పథకం అని చెప్పవచ్చు. ఇక ఇన్సూరెన్స్ పథకం ద్వారా చిన్న మధ్యతరగతి కుటుంబాల వారు బాగా లబ్ధి పొందవచ్చు.


ఇన్సూరెన్స్ స్కీమ్ లో కూలీలతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్హులేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.. నిజం చెప్పాలంటే కేంద్రం ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేసింది అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ సరికొత్త పథకాన్ని ప్రారంభించింది.. ఇక ఈ లేబర్ ఇన్సూరెన్స్ లో మీరు కూడా చేరాలి అనుకుంటే కేవలం సంవత్సరానికి 22 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది..5 సంవత్సరాల కాలపరిమితి ఉన్న ఇన్సూరెన్స్ స్కీమ్ లో ఐదేళ్లకు కలిపి ఒకేసారి 110 రూపాయలు అయినా చెల్లించవచ్చు.


ఇక ఈ ఇన్సూరెన్స్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు మనకు లభిస్తున్నాయి. అయితే ఈ పథకం లో చేరాలి అంటే 18 నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న ఎవరైనా సరే చేరవచ్చు   ముఖ్యంగా కూలీలు ,ఇతర పనులు చేసే స్త్రీ, పురుషులు ఈ స్కీం కింద బెనిఫిట్స్ పొందడానికి అర్హులు అవుతారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ స్కీం   వర్తించదు.. కావలసిన డాక్యుమెంట్స్ వివరాలకు విషయానికొస్తే.. ఆధార్ కార్డు ,రేషన్ కార్డు జిరాక్స్ జత చేయాల్సి ఉంటుంది. బ్యాంకు చలానా జతచేసి మండల పరిధిలో ఉన్న కార్మిక అధికారి కార్యాలయంలో ఈ బ్యాంకు చలానా తీసుకోవచ్చు.


కలిగే ప్రయోజనాలు ఏమిటంటే సహజమరణం పొందితే రూ.1,30,000 ఇన్సూరెన్స్ లభిస్తుంది. అదే ప్రమాదవశాత్తు మరణం పొందితే 6 లక్షల రూపాయల వరకు పొందవచ్చు. ఆ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు గనుక ఉంటే ఒక్కొక్కరికి 30 వేల రూపాయల చొప్పున వివాహ కానుకగా అందిస్తారు. ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు రూ.30 వేల చొప్పున రూ.60,000 ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఒక సంవత్సరం పాలసీ పొందిన తర్వాత లబ్ధిదారుడు ప్రమాదం జరిగి 50 శాతం వికలాంగులు అయితే రెండున్నర లక్షలు రూపాయలు పూర్తి స్థాయిలో వికలాంగులు అయితే ఐదు లక్షల రూపాయల పరిహారం లభిస్తుంది. పథకంలో మీరు కూడా చేరాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఎంపీడీవో / ఎమ్మార్వో ఆఫీస్ లో సంప్రదించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: