మనీ : రూ.501 కే హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్..!!
టెక్నాలజీ పుణ్యమా అని ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఇలాంటి మార్పులు చోటుచేసుకోవడంతో ఇప్పుడు పాలసీ తీసుకోవడం మరింత సులభతరం అయ్యింది. ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లో నుంచి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వెసులుబాటు కల్పించబడింది. ముందు కూడా తక్కువ ప్రీమియం రేటుతో పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కేవలం రూ. 501 తెలిస్తే చాలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు లభిస్తుంది అయితే ఈ పాలసీ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఫ్యూచర్ జెనరాలి కంపెనీ తాజాగా ఎఫ్ జీ గిఫ్ట్ ఆఫ్ హెల్త్ ప్రొడక్టులను అందుబాటులోకి తీసుకు రావడంతో ఇన్సూరెన్స్ పాలసీలు మీరు ఇతరులకు కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. ఇందులో రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి..ఒకటి ఫ్యూచర్ హాస్పిక్యాష్ , యాక్సిడెంట్ సురక్ష.. ఈ రెండు పాలసీ ఆప్షన్లు కూడా మంచి ప్రయోజనాలను అందిస్తాయి. కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు బంధువులకు కూడా మీకు నచ్చిన వారికి హెల్త్ పాలసీ బహుమతి గా అందించవచ్చు.
ఈ పాలసీ తీసుకోవడం వల్ల డైలీ క్యాష్ బెనిఫిట్స్ తో పాటు లంప్ సమ్ ఎఫెక్ట్స్ కూడా లభిస్తాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డిఎ ఐ శాండ్ బాక్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ ను గిఫ్ట్ గా ఇవ్వడానికి సాధ్యమవుతుంది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి మీరు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు..