మనీ : ఇకపై ఆ విషయంలో వాహనదారులకు గుడ్ న్యూస్..!
ఇక రానున్న రోజులలో నేషనల్ హైవే లపై ప్రయాణం చాలా తేలిక కానుంది. ఒక నిర్ణీత పరిమితి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే టోల్గేట్ ఫీజులు చెల్లించేలా టోల్ ఫ్లాజా లను తగ్గించడానికి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. టోల్ ఫ్లాజా లకు దగ్గరగా ఉంటూ పదేపదే హైవేలపై ప్రయాణించే స్థానిక ప్రజలకు కూడా భారీ ఊరట కలుగుతోంది. టోల్ ప్లాజా లకు దగ్గరగా నివసిస్తూ ఉండే స్థానికులు ఇకపై టోల్ ఫీజులను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు వీరికి ఒక పాస్ కూడా జారీ చేయనుంది. మూడు నెలల్లో ఈ నిర్ణయాలన్నీ అమలులోకి రానున్నాయి అని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు లోక్ సభలో వెల్లడించారు.
ఆయన లోక్ సభ లో ఏం మాట్లాడారు అంటే కేవలం మూడు నెలల్లో దేశంలో ఉన్న టోల్ ప్లాజాల సంఖ్యను ప్రభుత్వం తగ్గించనుంది అని 60 కిలోమీటర్ల పరిధిలో కేవలం ఒక్కరు మాత్రమే పని చేయాలి అని స్పష్టం చేశారు. 60 కిలోమీటర్ల వెలుపల ఉన్న ఇతర టోల్ ఫ్లాజా లను వచ్చే మూడు నెలల్లో మూసివేస్తున్నట్లు తెలిపారు. టోల్ ప్లాజాల గుండా ప్రయాణించే స్థానిక ప్రజలకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఒక పాస్ ను కూడా జారీ చేస్తామని తెలిపారు. దీంతో జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రయాణికులకు భారీ ఊరట కలగనుంది. చాలామంది జాతీయ రహదారుల పైన ప్రయాణం చేసేలా.. సమయం తగ్గి ఆదాయాన్ని పెంచుకోవాలని కూడా ప్రభుత్వం చూస్తోంది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.