మనీ: ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కేంద్రం శుభవార్త..!!
ఈ పథకంలో 10 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడపిల్లలు చేరడానికి అర్హులు అవుతారు. నెలకు వెయ్యి రూపాయల చొప్పున 14 సంవత్సరాల పాటు చెల్లించినట్లు అయితే 21 యేళ్లు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ సమయంలో 14 సంవత్సరాలలో మీరు రూ.1,68,000 రూపాయలను ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. ఇక 7.6 శాతం సంవత్సర వడ్డీతో కలుపుకొని సుమారుగా రూ. 4 లక్షలకు పైగా మీరు ఆదాయం పొందవచ్చు. ఏడాదికి రూ. 20 వేల చొప్పున పెట్టుబడిగా 14 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడం వల్ల 21 సంవత్సరం వచ్చేసరికి వడ్డీ కలుపుకొని రూ.9,63,429 లభిస్తుంది.
కనిష్టంగా 250 రూపాయలు మొదలుకొని గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఏడాదికి డిపాజిట్ చేయవచ్చు. ఇక ఆడపిల్ల యొక్క బంగారు భవిష్యత్తుకు ఇప్పటినుంచి బాటలు వేస్తే ఆమె భవిష్యత్తులో ఒకరిపై ఆధారపడకుండా సంతోషంగా జీవించగలుగుతారు. ఆడ పిల్లలకు ఇచ్చే గౌరవం ఇంతకన్నా మరొకటి ఉండదు అని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచే ఆడపిల్ల భవిష్యత్తు తగిన బాటలు వేయాలి అని ప్రభుత్వాలు కూడా ఆడపిల్లను కన్న తల్లిదండ్రులకు మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.