మనీ: హోమ్ లోన్ పొందే వారికి శుభవార్త.. తక్కువ వడ్డీకి లోన్ అందిస్తున్న బ్యాంక్..!!
సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా సామాన్యులను దృష్టిలో పెట్టుకొని కేవలం 6.50 శాతం వడ్డీతో ఇంటి రుణాలను ఇవ్వడానికి సిద్ధమైంది. అంతేకాదు ఇండస్ట్రీలో అతి తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా చోటు సంపాదించుకోవడం గమనార్హం. అంతేకాదు హోమ్ లోన్ అప్లై చేయడానికి ముందు కట్టాల్సిన ప్రాసెసింగ్ ఫీజును కూడా పూర్తిగా తొలగించింది. గత ఏడాది 6.75% వార్షిక వడ్డీ రేటు తో ఇంటి రుణాలను అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా శాతం తగ్గించి 6.50 శాతం వడ్డీతో రుణాలు అందిస్తామని ప్రకటించింది.
ఇకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించిన హోమ్ లోన్ ఆఫర్లు కేవలం కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా 2022 జూన్ 30 లోగా ఇంటి రుణాలు పొందాలని ఆలోచించేవారికి 6.5 శాతం వడ్డీరేటు తో లభిస్తోంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు కూడా పూర్తిగా మినహాయింపు లభించింది కాబట్టి బ్యాంక్ ఆఫ్ బరోడా లో తక్కువ వడ్డీకే హోమ్ లోన్ పొందవచ్చు..